TV ads
-
US Elections: వివేక్ రామస్వామి కీలక నిర్ణయం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియ వచ్చే నెల ప్రారంభం కానుంది. జనవరిలో అయోవా (iowa) రాష్ట్రంలో తొలి బ్యాలెట్ జరగనుంది. అయితే అయోవా ఓటింగ్‌కు మరికొద్ది రోజులే మిగిలి ఉండగా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఎన్నికల ప్రచారంలో ఇక నుంచి టీవీ చానళ్లకు ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించాం. అలాగని మొత్తం ప్రకటనల బడ్జెట్‌ను తగ్గించ లేదు. సంప్రదాయ టీవీ కాకుండా వేరే మార్గాల్లో ఓటర్లను రీచ్ అవుతాం. టీవీ ప్రకటనలపై ఖర్చు పెడితే పెద్దగా ఉపయోగం ఉండటం లేదు’ అని వివేక్ రామస్వామి క్యాంపెయిన్ మేనేజర్ ట్రిసియా మెక్ లాలిన్ తెలిపారు. అయితే తాను ఇప్పటికే క్యాంపెయినింగ్ కోసం 20 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు రామస్వామి స్వయంగా మీడియాకు తెలిపారు. ఇంత ఖర్చు చేసినప్పటికీ అయోవాలో రామస్వామివైపు రిపబ్లికన్లు పెద్దగా మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. అయోవాలో 10 శాతం రిపబ్లికన్ల ఓట్లు కూడా రామస్వామికి వచ్చే పరిస్థితులు లేవని సమాచారం. ఇక దేశవ్యాప్తంగా కూడా రామస్వామి గ్రాఫ్ రోజురోజుకు పడిపోతున్నట్లు తెలుస్తోంది. కాగా, రిపబ్లికన్ల తరపున ప్రధాని అభ్యర్థిత్వానికి పోటీలో ఉన్న వారిలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హాట్ ఫేవరెట్‌గా దూసుకెళుతుండడం విశేషం. ఇదీచదవండి..భారత్‌లో ఉన్న పౌరులకు ఇజ్రాయెల్ అడ్వైజరీ -
టోక్యో ఒలింపిక్స్: ప్రచారానికి ‘టయోటా’ టాటా...
Tokyo Olympics TV Ads: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి సుదీర్ఘ కాలంగా అండగా నిలుస్తున్న అగ్రశ్రేణి స్పాన్సర్ కంపెనీ టయోటా. జపాన్‌కు చెందిన ఈ ప్రఖ్యాత కంపెనీ ఈ సారి స్వదేశంలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ప్రచారంతో హోరెత్తిస్తుందని అంతా అనుకున్నారు. అయితే టయోటా భిన్నంగా ఆలోచించింది. కరోనా నేపథ్యంలో దేశ ప్రజల అయిష్టత మధ్య జరుగుతున్న ఒలింపిక్స్‌లో తాము ప్రచారం చేసుకుంటే మేలుకంటే కీడే ఎక్కువ జరుగుతుందని భావించింది. అందుకే ఒలింపిక్స్ సమయంలో జపాన్‌లో వచ్చే టీవీ ప్రకటనలనుంచి తమ బ్రాండ్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. గేమ్స్ జరిగినన్ని రోజులు టీవీలో టయోటా ప్రకటనలు కనిపించవని వెల్లడించింది. కంపెనీ సీఈఓ అకియో టయోడా ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా హాజరు కావడం లేదు. ఎనిమిదేళ్ల కాలానికి సుమారు వంద కోట్ల డాలర్లు (దాదాపు రూ. 7 వేల కోట్లు) స్పాన్సర్ షిప్‌గా టయోటా ఐఓసీకి చెల్లిస్తుండటం విశేషం. మరో వైపు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే కూడా ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలకు టోక్యో వెళ్లడం లేదని ప్రకటించారు. క్రీడలకు హాజరై ఆపై జపాన్ ప్రధాని యోషిహితె సుగతో విభిన్న ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపాలని ఆయన భావించగా... సమావేశం జరిగే అవకాశం లేకపోవడంతో ఒలింపిక్స్‌కూ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1731380308.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బాబుగారి ‘ఘన కార్యాలు’ బట్టబయలు!
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ ప్రచారం నవ్వుల పాలవుతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి టీవీల్లో ‘పచ్చ’ ప్రకటనలు హోరెత్తున్నాయి. బాబుగారి ‘ఘన కార్యాల’ను చూపిస్తూ టీవీలో వస్తున్న ప్రకటనలోని డొల్లతనాన్ని సోషల్ మీడియా వేదికగా సామాన్యులు బట్టబయలు చేస్తున్నారు. (లోకేష్.. పసుపు కుంకుమ మాకు రాలే!) టీడీపీ ప్రచారం చేసుకుంటున్నట్టుగా వాస్తవ పరిస్థతులు లేవని ఆధారాలతో బయటపెడుతున్నారు. నారా వారి అసత్య ప్రచారాన్ని నికార్సైన నిజాలతో ప్రజలకు చూపిస్తున్నారు. రాయలసీమకు నీళ్లు పారించామని చంద్రబాబు కొట్టుకుంటున్న ‘సెల్ఫ్ డబ్బా’ను సామాన్యుడు ఎలా ఛేదించాడో మీరే చూడండి. -
స్టేట్మెంట్ సదానందం గారి పొంతన లేని చింతన!
ఉత్త(మ)పురుష ‘‘ఆడదానికి అందంతో పని. మగాడికి పనే అందం’’ ఇదీ స్టేట్మెంట్ సదానందం తాలూకు ఒక గొప్ప కొటేషన్. అలవోకగా, ఆశువుగా కొట్టొచ్చినట్టు కొటేషన్స్ ఇస్తుంటాడు కాబట్టి సదానందాన్ని అందరూ స్టేట్మెంట్ సదానందం అంటుంటారు. పైది ఆయన వెలువరించిన స్టేట్మెంట్లలో ఒక గొప్ప కొటేషన్. అయితే విచిత్రం ఏమిటంటే... సదానందం భార్య తాలూకు కాస్మటిక్స్ అన్నీ త్వరత్వరగా అయిపోతుండటం, అవి నిండుకోడానికి పట్టే వ్యవధి రోజురోజుకూ తరిగిపోతుండటంతో అబ్బురపడుతోంది సుమతి. ఒకరోజు ఆ మిస్టరీ విడిపోయింది. కారణం తన మిస్టరేనని తేలిపోయింది. అర్ధరాత్రుళ్లు లేచి ఆమె కాస్మటిక్స్‌ను రహస్యంగా రాసుకుని మళ్లీ పడుకునే పని పెట్టుకున్నాడు సదానందం. అదేంటంటే... ఆడవాళ్లను అంతగా ఆకర్షించే అంశం ఏముందో చూసే ‘పని’ పట్టుకున్నాను. అందుకే ఈ ‘పని’ అంటూ మేకప్ చేశాడా మొగుడు. అలాంటిదే మరో ఘటన. ‘‘లోకంలోని తెలివితక్కువ వాళ్ల మెదళ్ళలో ఏం పెట్టాలో తెలియలేదు బ్రహ్మకు. అందుకే వాళ్ల తలపై వెంట్రుకలు మొలిపించి, వాటి తాలూకు వేరు మెదళ్లలోని ఖాళీ స్థలాన్ని ఆక్రమించేలా చేశాడు. అదే తెలివిగల వాడి మెదడు పూర్తిగా చురుగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ల తలపై వెంట్రుకలే నిలబడలేకుండా చేశాడు’’ అంటూ పెద్ద స్టేట్‌మెంటొకటి ఇచ్చాడు సదానందం. ఇలా అన్నవాడు తన మాటకు కట్టుబడి ఉండాలా, వద్దా? మళ్లీ తానే రాత్రంతా జట్టు మొలిపిస్తామంటూ గంటలకొద్దీ నడుస్తూ ఊదరగొట్టే టీవీ యాడ్స్ చూస్తూ, వాటిని రహస్యంగా తెప్పించుకుని, అర్ధరాత్రి లేచి వాటిని తలకుపట్టిస్తూ, తలగడకు పామేస్తూ ఉంటాడు. ‘‘నా భర్తది నాలుక కాదు... అదో విలువైన డబ్బు నాణెం’’ అంది సుమతి. ‘‘అబ్బ ఈ కొటేషన్‌తో నా భార్యవనిపించావు. స్టేట్మెంట్ సదానందం సతీమణా, మజాకా’’ అన్నాడా భర్త. ‘‘అవునండీ... నాణేనికీ రెండు పార్శ్వాలూ... మీ నాల్కకూ రెండు సైడ్లు. టాస్ విసిరినట్టుగా మాటను గాల్లోకి ఎగరేయడం మీ పని. అదే సైడు పడుతుందన్నది అచ్చం మీ ఆచరణ లాంటిది. ఎంతైనా మీరు ద గ్రేట్ కొటేషన్ కింగ్ అయిన స్టేట్మెంట్ సదానందం కదా’’ అంది సుమతి. - వై