కెనడాలో జయహో జగన్‌ | Ysrcp Nri Memebers Meeting Was Help In Canada Toronto | Sakshi
Sakshi News home page

కెనడాలో వైఎస్సార్సీపీ ఎన్నారై సభ్యుల ఆత్మీయ సమావేశం

Published Tue, Nov 7 2023 12:33 PM | Last Updated on Tue, Nov 7 2023 4:38 PM

Ysrcp Nri Memebers Meeting Was Help In Canada Toronto - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, రాజకీయాలు వేడేక్కుతున్న వేళ.. కెనడా టొరొంటో నగరంలోని మిస్సిసాగా  పట్టణంలో YSRCP కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కెనడాలోని ప్రవాసాంధ్రులు, డా. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి  మరియు సీయం జగన్‌ను అభిమానించే తెలుగు వారు హాజరయ్యారు.

ఒక్క వేదికపైకి ప్రముఖులు, ప్రవాసాంధ్రులు

YSRCP కెనడా అడ్వైజర్ డా.గరిశ జగన్మోహన్ రెడ్డి, కన్వీనర్ వేణు చుక్కలూరు మరియు వైఎస్సార్సీపీ గ్లోబల్ కన్వీనర్ వెంకట్ ఎస్. మేడపాటి సమన్వయ సహకారాలతో, కెనడా కార్య వర్గ సభ్యుల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ NRIల ఆత్మీయ సమావేశం ఒక పండుగలా జరిగింది. ఈ సమావేశానికి అమెరికా నుంచి YSRCP కన్వీనర్లు అయిన కె.వి రెడ్డి, కోరసపాటి శ్రీధర్ రెడ్డి (నాటా ప్రెసిడెంట్),  వాసుదేవ రెడ్డి,  వల్లూరు రమేష్ రెడ్డి మొదలైన ప్రముఖులందరూ స్వయంగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు తదితరులు జూమ్ కాల్ ద్వారా సమావేశంలో ప్రసంగించారు.

ఇది సంక్షేమ ప్రభుత్వం

అమెరికా నుంచి వచ్చిన అతిధులను కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు వేదిక మీదికి ఆహ్వానించి సభ ప్రారంభించారు. అలాగే మళ్లీ సీఎం జగన్‌ నేతృత్వంలోని YSRCP ప్రభుత్వం అధికారంలోకి ఎందుకు రావాలో వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్న నీటిపారుదల శాఖ మంత్రి  అంబటి రాంబాబు  మాట్లాడుతూ.. "కోవిడ్ మహమ్మారి బారినపడి చిన్నాచితక వ్యాపారాలు దెబ్బతిని అనేకమంది పేదరికంలోకి చేరారు. అలాంటి పేదవారిని కోవిడ్ సమయంలోనే కాక, ఇప్పటికీ ఆదుకుంటున్న సంక్షేమ, సాధికారిక ప్రభుత్వం YSRCP" అని తెలిపారు. "మ్యానిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి, నవరత్నాలను 99% అమలు చేసి పేదరికాన్ని పారద్రోలి 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు అందజేసిందని" తెలిపారు.

(కెనడా YSRCP కార్యక్రమం ఫోటోగ్యాలరీ)

అభివృద్ధికి ఇదే నిదర్శనం

పర్యాటక శాఖ మంత్రి  ఆర్కే రోజా మాట్లాడుతూ.. "ఇప్పటివరకు జగనన్న ప్రభుత్వం 67,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 127 పెద్ద పరిశ్రమలు, 85,000 ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. ఇన్ఫోసిస్ లాంటి మెగా సంస్థలు వైజాగ్ లో కార్యాలయాలు మొదలుపెట్టడం ప్రభుత్వ ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. ఏపీలో పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తోందని., NRIలు కూడా ఏపీ లో  కొత్త సంస్థలు ప్రారంభించాలని, అలాగే ఉన్న సంస్థలను  విస్తరించాలని కోరారు.

నిజం చాటండి

శాప్ అధ్యక్షులు  బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి మాట్లాడుతూ విదేశాల్లో ఉంటున్నవారు  తమ ప్రాంత అభివృద్ధి కోసం పరితపిస్తూ, తమ సొంత గ్రామాలకు, మాతృ రాష్టానికి సాయం చేయాలనే ప్రవాసాంధ్రుల తపనను అభినందించారు. ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తోన్న పచ్చ మీడియాను ఎదుర్కొని.. వాస్తవాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలిపాలని కోరారు.

మళ్లీ జగనన్న ప్రభుత్వమే

"ప్రతి రంగంలోనూ అభివృద్ధికి బాట వేస్తూ, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్న ప్రభుత్వం మనది. 2019లో అందరం కష్టపడి పార్టీని గెలిపించి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని  చేశాము. ఇప్పుడు జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఇంటికి  తెలియజేసి మరిన్ని ఎక్కువ సీట్లతో, మెజారిటీతో  YSRCP ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరం కృషి చేయాలని" ఎన్నారై గ్లోబల్ అడ్వైజర్  వెంకట్ ఎస్. మేడపాటి కోరారు.   

విష ప్రచారం తిప్పిగొట్టాల్సిన వేళ

ఉత్తర అమెరికాకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, పార్టీ కన్వీనర్  కడప రత్నాకర్  మాట్లాడుతూ.. "ప్రజల కోసం ప్రభుత్వం పడుతున్న తపన గురించి వివరించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్‌ ప్రభుత్వం ముందుకెళ్తోందని, ఐదేళ్ల కిందికి, ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు. విద్య, వైద్యం విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలిచిందని, ముఖ్యంగా వెనుకబడిన బీసీ వర్గాల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తోందని" కొనియాడారు. ఇప్పుడు ప్రవాసాంధ్రులు తమ సత్తా చాటాల్సిన సమయం వచ్చిందని, ప్రభుత్వంపై దురుద్దేశపూర్వకంగా దాడి చేస్తోన్న పచ్చమీడియాను, అధికారయావతో పొత్తులు పెట్టుకున్న విపక్షాలను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమయిందన్నారు. ప్రతీ ప్రవాసాంధ్రుడు తన వంతుగా.. తనకు తెలిసిన వారికి కొందరికైనా ఫోన్‌ చేసి వాస్తవాలను వివరించాలని కోరారు.

ప్రతీ ఎన్నారై నినదించాల్సిన వేళ

US కన్వీనర్ KV రెడ్డి  మాట్లాడుతూ.. "ప్రభుత్వం 4.69 లక్షల కోట్ల రుపాయలను సంక్షేమం ద్వారా  పేద ప్రజలకు అందించిందని,  ఇలాంటి సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే  “మళ్లీ రావాలి మన జగన్ “ అనే నినాదం తో ఆడిటోరియంను హోరెత్తించారు. మరో యూఎస్ కన్వీనర్ దోసపాటి శ్రీధర్ రెడ్డి  మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం మనబడి - నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూల్స్ లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం మనందరికీ తెలుసన్నారు. ప్రతి NRI తమ సొంత గ్రామాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

విద్య, వైద్యానికి సీఎం జగన్‌ పెద్దపీట

ఎన్నారై మెడికల్ అఫైర్స్ అడ్వైజర్ వాసుదేవ రెడ్డి  మాట్లాడుతూ "జగనన్న ప్రభుత్వంలో ఇప్పటికే 17 కొత్త మెడికల్ కాలేజీలు, 10వేల వైయస్సార్ క్లినిక్ లు, ప్రతి మండలానికి రెండు పీ.హెచ్.సి లు కోసం 16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని" తెలిపారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం గురించి వివరించారు. గుండెపోటు వచ్చిన ఒక గంటలో వేయవలసిన 40 వేల రూపాయల ఇంజక్షన్ పేదలందరికీ ఉచితంగా ఇస్తోన్న ఘనత జగనన్న ప్రభుత్వానిదేనన్నారు.

ఇది అప్రమత్తంగా ఉండ్సాలిన వేళ

ఇంకో యూఎస్ కన్వీనర్ రమేష్ రెడ్డి  మాట్లాడుతూ  "ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం నాలుగేళ్లలో 2.58 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఎన్నికలొస్తున్న ప్రస్తుత తరుణంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమ ప్రభుత్వంపై శత్రు మూకలన్నీ అసత్య ప్రచారాలతో దాడి చేస్తున్న వేళ.. నిజం నిర్భయంగా ప్రజలకు చేరాలని, సత్యం చాటి చెప్పే బాధ్యత YSRCP సైనికులదని, ఆ దిశగా పడిన అడిగే కెనడా YSRCP సమావేశమంటూ జయహో జగన్" అని నినదించారు.

వై నాట్‌ 175

ఇంకో 6 నెలల్లో రాబోతున్న ప్రభుత్వ ఎన్నికల్లో “వై నాట్ 175” అన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మరోసారి YSRCP ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు.

పోయిన సంవత్సరం ఆక్సిడెంట్ లో మృతి చెందిన APNRT సభ్యుడు రామ్ పిరకాలకు నివాళి అర్పించి సభలో ఒక నిమిషం మౌనం పాటించారు. తర్వాత తన్వి ,శాన్వి ,అవని ,జనని , కీర్తి , మేధ మొదలైన చిన్నారులు తమ నృత్య ప్రదర్శన ద్వారా ఆహుతులను ఆకట్టుకున్నారు. చిన్నారుల ఆట పాటలతో, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో, కమ్మని విందు బోజనముతో ఈ కార్యక్రమము  ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది. ఈ కార్యక్రమము విజయవంతం అవడానికి కృషి చేసిన కార్యవర్గ సభ్యులు మరియు వాలంటీర్ లను నిర్వాహకులు అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement