వాషింగ్టన్: అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ తొలి విజయాన్ని అందుకున్నారు. అయోవాలో సోమవారం జరిగిన పోలింగ్‌లో ట్రంప్ మెజారిటీ ఓట్లను సాధించారు. దీంతో రిపబ్లికన్ పార్టీ రెండో అభ్యర్థి స్థానం కోసం నిక్కీ హైలీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌ల మధ్య పోటీ నెలకొంది. తొలి పోలింగ్‌లోనే ట్రంప్ ఘన విజయంతో.. రిపబ్లికన్ పార్టీపై ఆయన ఏ మాత్రం పట్టు కోల్పోలేదని స్పష్టమవుతోంది.
రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు కొన్ని నెలల పాటు ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అయోవాలో నిన్న జరిగిన పోలింగ్.. రిపబ్లికన్ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో మొదటిది ఎన్నిక. తీవ్ర స్థాయిలో మంచు కురుస్తున్నప్పటికీ ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో ప్రజలు పాల్గొన్నారు. అయోవాలో విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన ట్రంప్‌కు ఈ ఫలితం శుభసూచకంగా మారింది.
అమెరికా అధ్యక్షున్ని ఎన్నికునే ప్రక్రియలో అయోవాకు రెండు శాతం కంటే తక్కువ ఓటింగ్ ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో జరిగే ఓటింగ్‌పైనే పూర్తి విజయం ఆధారపడి ఉంటుంది. న్యూ హాంప్‌షైర్, నెవాడా, సౌత్ కరోలినాలో ట్రంప్‌కు విజయం తప్పకుండా అవసరమైతుంది. ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ట్రంప్‌పై కొలరాడో, మైన్ రాష్ట్రాలు ఆయనను నిషేధించాయి. దీనిపై ఆయన అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్ పోటీ పడుతుండటం వరుసగా ఇది మూడోసారి.
ఇదీ చదవండి: పుతిన్, మోదీ కీలక చర్చలు.. రష్యాకు విషెస్ చెప్పిన ప్రధాని
Comments
Please login to add a commentAdd a comment