Iowa state
-
అమెరికాలో భారీ వర్షాలు
వాషింగ్టన్: ఎడతెరిపి కురుస్తున్న భారీ వర్షాలతో అమెరికాలో అయోవా రాష్ట్రం అతలాకుతలమైంది. వర్షపు నీటిలో మునిగి రహదారులు కనిపించకుండాపోయాయి. ఇళ్లు నీట మునగడంతో జనం సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. జలదిగ్భందంలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ సాయంతో రక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. పడవల్లో జనాలను వేరే చోట్లకు తరలిస్తున్నారు. అయోవా రాష్ట్రంలోని సియాక్స్ కౌంటీలోని రాక్‌వ్యాలీ జనావాసం మొత్తం జలమయమైంది. 21 కౌంటీల్లో అత్యవసర పరిస్థితి విధించారు.45.72 సెంటీమీటర్ల వర్షపాతం సౌత్ డకోటాలోనూ భీకర వర్షాలు కురుస్తున్నాయి. ఆగ్నేయ సియాక్స్ ఫాల్స్ సమీపంలోని కాన్టన్ పట్ణణంలో ఏకంగా 45.72 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జాతీయ రహదారులపైనా వర్షపు నీరు నిలిచింది. దీంతో హైవేలపై రాకపోకలను పోలీసులు ఆపేశారు. మిన్నెసోటాలోనూ రాష్ట్ర రహదారులను మూసేశారు. మిగతా రాష్ట్రాలు అతి ఎండలు అమెరికాలో ఓవైపు వర్షాలు వణికిస్తుంటే మిగతా రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. 1.5 కోట్ల జనాభాను వడగాల్పులు వేధిస్తున్నాయని, మరో 9 కోట్ల మంది భయంకర ఎండల బారిన పడ్డారని జాతీయ వాతావరణ సంస్థ ఆదివారం ప్రకటించింది. 1936 తర్వాత ఎన్నడూలేనంతగా గత ఏడాది అత్యధిక వడగాల్పులు అమెరికాకు ముచ్చెమటలు పట్టించాయి. దీంతో గత 45 ఏళ్లలో ఎప్పుడూలేనంతగా 2,300 మంది ఎండసంబంధ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. సోమవారం వాషింగ్టన్, కాలిఫోరి్నయాలోని సెంట్రల్ వ్యాలీల్లో అధిక ఉష్ణోగ్రత నమోదుకావచ్చని వాతావరణ శాఖ తెలిపింది. -
US Elections: వివేక్ రామస్వామి కీలక నిర్ణయం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియ వచ్చే నెల ప్రారంభం కానుంది. జనవరిలో అయోవా (iowa) రాష్ట్రంలో తొలి బ్యాలెట్ జరగనుంది. అయితే అయోవా ఓటింగ్‌కు మరికొద్ది రోజులే మిగిలి ఉండగా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఎన్నికల ప్రచారంలో ఇక నుంచి టీవీ చానళ్లకు ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించాం. అలాగని మొత్తం ప్రకటనల బడ్జెట్‌ను తగ్గించ లేదు. సంప్రదాయ టీవీ కాకుండా వేరే మార్గాల్లో ఓటర్లను రీచ్ అవుతాం. టీవీ ప్రకటనలపై ఖర్చు పెడితే పెద్దగా ఉపయోగం ఉండటం లేదు’ అని వివేక్ రామస్వామి క్యాంపెయిన్ మేనేజర్ ట్రిసియా మెక్ లాలిన్ తెలిపారు. అయితే తాను ఇప్పటికే క్యాంపెయినింగ్ కోసం 20 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు రామస్వామి స్వయంగా మీడియాకు తెలిపారు. ఇంత ఖర్చు చేసినప్పటికీ అయోవాలో రామస్వామివైపు రిపబ్లికన్లు పెద్దగా మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. అయోవాలో 10 శాతం రిపబ్లికన్ల ఓట్లు కూడా రామస్వామికి వచ్చే పరిస్థితులు లేవని సమాచారం. ఇక దేశవ్యాప్తంగా కూడా రామస్వామి గ్రాఫ్ రోజురోజుకు పడిపోతున్నట్లు తెలుస్తోంది. కాగా, రిపబ్లికన్ల తరపున ప్రధాని అభ్యర్థిత్వానికి పోటీలో ఉన్న వారిలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హాట్ ఫేవరెట్‌గా దూసుకెళుతుండడం విశేషం. ఇదీచదవండి..భారత్‌లో ఉన్న పౌరులకు ఇజ్రాయెల్ అడ్వైజరీ -
Viral Video: దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి
-
దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి
వాషింగ్టన్: మంటల్లో తగలబడుతున్న ఇంట్లోకి దూకి అందులోని వారిని హీరో రక్షించే సన్నివేశాలు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. అలాంటి సంఘటనే అమెరికాలోని అయోవా ప్రాతంలో జరిగింది. మంటల్లో దగ్ధమవుతున్న ఇంట్లోని నలుగురు తోబుట్టువులను రక్షించాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఈనెల 23న జరిగింది. ఇంట్లోని డోర్‌బెల్ కెమెరాలో నమోదైన భయానక దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇంట్లోంచి ప్రాణాలతో బయటపడిన వారిలో 8,14,17,22 ఏళ్ల వయసు వారిగా పోలీసులు తెలిపారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు ఇంటి యజమాని, నలుగురు పిల్లల తల్లి టెండర్ లెమన్. మన జీవితాలు శాశ్వతంగా మారిన రోజు! కానీ, బూడిద నుంచే కదా?? అంటూ రాసుకొచ్చారు. వీడియో ప్రకారం.. మంటల్లోంచి ముగ్గురు పరుగెడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత అగ్ని జ్వాలలు మరింత అలుముకున్నాయి. కొద్ది సేపటికి ముందు నుంచి 22 ఏళ్ల యువకుడు సైతం అందులోంచి బయటకు వచ్చాడు. బ్రెండన్ బ్రిట్ అనే వ్యక్తి తన కారులో వెళ్తూ దారి తెలియక మరో మార్గంలో వెళ్లాడు. ఆ మార్గంలో ఓ ఇల్లు మంటల్లో కాలిపోతుండటాన్ని చూశాడు. వెంటనే అక్కడికి వెళ్లి కిటికీలను పగలగొట్టి లోపల ఎవరైనా ఉన్నారేమో పరీక్షించినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. అర్ధరాత్రి సమయం కాబట్టి ఇంట్లో ఎవరైనా ఉండి ఉంటారని భావించానని, వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు బ్రిట్ చెప్పారు. మంటలు తీవ్రమవుతున్న క్రమంలో లోపలి ఉన్న వారిని అలర్ట్ చేసి ఇంటి గుమ్మం గుండా బయటకు పంపించినట్లు తెలిపారు. మరోవైపు.. స్మోక్ అలారం మోగకపోవటంతో తాము గాఢ నిద్రలో ఉన్నామని, బయట నుంచి అరుపులు విని లేచినట్లు బాధితులు తెలిపారు. ఆ సమయంలో వారి తల్లిదండ్రులు వేరే ప్రాంతానికి వెళ్లారని చెప్పారు. ఈ సందర్భంగా బ్రిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు ఇంటి యజమాని లెమన్. ఈ మంటల్లో ఇల్లు పూర్తిగా దగ్ధమైందని, ఐదు పెంపుడు శునకాలు మృతి చెందాయని, మరో రెండు గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. అయితే, ఇంట్లో మంటలు చెలరేగాడానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేపట్టినట్లు రెడ్ ఓక్ ఫైర్ విభాగం తెలిపింది. ఇదీ చదవండి: బోల్సోనారో ఓటమి.. బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్వా -
అమెరికాలో నలుగురు తెలుగువారు దుర్మరణం
వెస్ట్‌డెస్ మోయిన్స్: అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి వెస్ట్‌డెస్ మోయిన్స్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తెలుగువారు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మృతుల శరీరంపై తుపాకీ బుల్లెట్ల గాయాలున్నాయి. ఈ విషయమై నగర పోలీస్ సార్జంట్ డాన్ వేడ్ మాట్లాడుతూ..‘యాష్‌వర్త్ రోడ్డు–అస్పెన్ డ్రైవ్‌ల మధ్య ఉన్న 65 స్ట్రీట్‌లోని ఓ ఇంట్లో సమస్య ఉందని శనివారం ఉదయం 10 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) 911కు ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో మా యూనిట్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఇంట్లో బుల్లెట్ గాయాలతో రక్తపు మడుగులో ఉన్న నలుగురి మృతదేహాలను గుర్తించాం. ఈ దుర్ఘటనలో చంద్రశేఖర్ సుంకర(44), లావణ్య సుంకర(41)తో పాటు 15, పదేళ్ల వయసున్న ఇద్దరు అబ్బాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. వీరి ఇంటికి వచ్చిన బంధువుల్లో ఒకరు నలుగురి మృతదేహాలను చూడగానే భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం అటుగా వెళుతున్నవారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు’అని తెలిపారు. రియల్ ఎస్టేట్ రికార్డుల ప్రకారం లావణ్య–చంద్రశేఖర్ ఈ ఇంటిని 2019, మార్చి 25న కొనుగోలు చేశారని వెల్లడించారు. పోస్‌మార్టం తర్వాతే మరణానికి గల కారణాన్ని అధికారికంగా చెప్పగలమన్నారు. ఈ దుర్ఘటనపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. వెస్ట్‌డెస్ మోయిన్స్‌లో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయనీ, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. కాగా, ముగ్గురు కుటుంబ సభ్యులను చంద్రశేఖరే కాల్చిచంపాడనీ, అనంతరం తనను తాను కాల్చుకున్నాడని కొందరు స్థానికులు తెలిపారు. ఆయన గతకొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. -
అమెరికాలో దారుణం
ఐవోవా: అమెరికాలోని ఐవోవా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో నలుగురు తెలుగు వాళ్లు మృతిచెందారు. మృతులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుంకర చంద్రశేఖర్, లావణ్య, వారి ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. చంద్రశేఖరే భార్యా పిల్లల్ని కాల్చి చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానిక పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చంద్రశేఖర్ మానసిక స్థితి కొంతకాలంగా సరిగా లేనట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రిపబ్లికన్ పార్టీ కో చైర్మన్ గా హైదరాబాదీ!
వాషింగ్టన్: అమెరికాలో మరో హైదరాబాదీ సత్తా చూపాడు. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త గోపాల్ టీకే కృష్ణ ఐవా స్టేట్ రిపబ్లికన్ పార్టీ కో చైర్మన్ గా ఎంపికయ్యాడు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో ఉన్నత విద్యను అభ్యసించిన గోపాల కృష్ణ అమెరికాలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఐవా స్టేట్ లో కో చైర్మన్ గా సేవలందిస్తున్న డానీ కారోల్ స్థానంలో గోపాల్ కృష్ణ నియమితులయ్యారు. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున కీలక పాత్ర పోషించే అవకాశం గోపాల్ కృష్ణకు దక్కింది. పార్టీ శ్రేణుల్ని ఏకం చేయడానికి ప్రాథమిక ఎన్నికల వరకు వేచి ఉండలేనని.. తక్షణమే పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేసి, అత్యధిక సంఖ్యలో ఓటర్లు నమోదు చేసుకునేలా కృషి చేస్తాను అని అన్నారు. సాధ్యమైనంత వరకు మైనారిటీ కమ్యూనిటీలను ఏకం చేస్తానన్నారు. 1969 లో అమెరికాకు వలసపోయిన గోపాల కృష్ణ రిపబ్లికన్ పార్టీకి చాలా సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. హైదరాబాద్ లోని మెథడిస్ట్ స్కూల్ లో హైస్కూల్ విద్యను అభ్యసించిన గోపాల కృష్ణ.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గ్యాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆరత్వాత కన్సాస్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్ డిగ్రీ పుచ్చుకున్నారు. కృష్ణ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇన్. కు వ్యవస్థాపకుడిగా వ్యాపార కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నారు.