రిపబ్లికన్ పార్టీ కో చైర్మన్ గా హైదరాబాదీ!
Published Tue, Apr 1 2014 1:55 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
వాషింగ్టన్: అమెరికాలో మరో హైదరాబాదీ సత్తా చూపాడు. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త గోపాల్ టీకే కృష్ణ ఐవా స్టేట్ రిపబ్లికన్ పార్టీ కో చైర్మన్ గా ఎంపికయ్యాడు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో ఉన్నత విద్యను అభ్యసించిన గోపాల కృష్ణ అమెరికాలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఐవా స్టేట్ లో కో చైర్మన్ గా సేవలందిస్తున్న డానీ కారోల్ స్థానంలో గోపాల్ కృష్ణ నియమితులయ్యారు. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున కీలక పాత్ర పోషించే అవకాశం గోపాల్ కృష్ణకు దక్కింది.
పార్టీ శ్రేణుల్ని ఏకం చేయడానికి ప్రాథమిక ఎన్నికల వరకు వేచి ఉండలేనని.. తక్షణమే పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేసి, అత్యధిక సంఖ్యలో ఓటర్లు నమోదు చేసుకునేలా కృషి చేస్తాను అని అన్నారు. సాధ్యమైనంత వరకు మైనారిటీ కమ్యూనిటీలను ఏకం చేస్తానన్నారు. 1969 లో అమెరికాకు వలసపోయిన గోపాల కృష్ణ రిపబ్లికన్ పార్టీకి చాలా సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు.
హైదరాబాద్ లోని మెథడిస్ట్ స్కూల్ లో హైస్కూల్ విద్యను అభ్యసించిన గోపాల కృష్ణ.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గ్యాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆరత్వాత కన్సాస్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్ డిగ్రీ పుచ్చుకున్నారు. కృష్ణ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇన్. కు వ్యవస్థాపకుడిగా వ్యాపార కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నారు.
Advertisement
Advertisement