
న్యూయార్క్: అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ క్లబ్ యజమాని అయిన భారతీయ అమెరికన్ మరణించాడు. గుజరాత్‌కు చెందిన ఆకాశ్ తలాటీ (40) అనే వ్యక్తి ఫేయట్‌విల్ నగరంలో ఓ క్లబ్ నిర్వహిస్తున్నాడు. మార్కీస్ డెవిట్ అనే యువకుడు స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి క్లబ్‌లో ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుండటంతో సెక్యూరిటీ సిబ్బంది అతణ్ని బయటకు గెంటేశారు.
ఆ తర్వాత గన్ పట్టుకుని అక్కడకు వచ్చిన డెవిట్ సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపాడు. సిబ్బంది కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఆ సమయంలో అక్కడే నిలబడి ఉన్న ఆకాశ్‌తోపాటు మరో నలుగురు గాయపడ్డారు. డెవిట్‌కు కూడా నాలుగు బుల్లెట్లు తగిలాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఆకాశ్ ప్రాణాలు విడిచాడు. మిగిలిన వారు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. కాగా, ఆకాశ్ కుటుంబానికి అన్ని విధాలుగా సాయపడతామని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment