Spirit Airlines flight
-
విమానంలో టాయిలెట్ వాడొద్దన్న సిబ్బంది.. మహిళ ఏం చేసిందంటే..
వాషింగ్టన్: అమెరికాకు చెందిన స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానంలో ఓ మహిళను టాయిలెట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు అందులోని ఫ్లైట్ అటెండెంట్లు. రెండు గంటలపాటు ఓపిక పట్టిన ఆ మహిళ ఇంక ఆపుకోలేక విమానం ఫ్లోర్ మీదే మూత్రవిసర్జన చేసింది. క్యాబిన్ క్రూ బృందంలోని ఒకరు ఈ ఉదంతాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో ఫ్లైట్లలో జరుగుతున్న విచిత్ర సంఘటనలు కొన్ని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే ఓ ప్రయాణికుడు ఫుల్లుగా తాగి తోటి ప్రయాణికుడి మీద మూత్రం పోయడం, ప్రయాణికులను మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయిన పైలట్.. ఇలా వరుసగా కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా స్పిరిట్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్‌లో జరిగిన అలాంటి ఓ సంఘటన హెడ్ లైన్స్ లో నిలిచింది. జులై 20న స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానంలో ఆఫ్రికన్ అమెరికా మహిళ ఒకరు తనకు టాయిలెట్ అర్జెంటని అక్కడి సిబ్బందితో చెప్పగా వారు ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే అనుమతించడం కుదరదని చెప్పారు. అలాగే ఆమెను నీళ్లు ఎక్కువగా తాగమని లేదంటే మూత్రవిసర్జన చేసినప్పుడు ఫ్లైటంతా దుర్వాసన వస్తుందని కూడా ఉచిత సలహా ఇచ్చారు. దీంతో ఆమె చాలాసేపు ఓపికపట్టి కూర్చుంది. ఆలా రెండు గంటలు ఓపిగ్గా ఎదురు చూసిన తర్వాత కూడా సిబ్బంది టాయిలెట్‌కు అనుమతించకపోవడంతో ఆమె ఫ్లోర్ మీదనే మూత్రవిసర్జన చేసింది. అనంతరం ఫ్లైట్ సిబ్బంది ప్రశ్నించగా.. మీ అనుమతి కోసం ఎంతసేపు ఆగాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సదరు మహిళ. ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు ఇష్టానుసారంగా స్పందిస్తున్నారు. ఫ్లైట్ సిబ్బంది తీరు అమానుమని కొందరంటే.. మా పెంపుడు పిల్లి చాలా శుభ్రాన్ని పాటిస్తుందని మరొకరు కామెంట్ చేశారు. ఎవరో ఎదో అన్నారని కాదుగానీ టాయిలెట్ విషయంలో ఇరుపక్షాల్లో నిర్లక్ష్యం సరికాదని అత్యధికులు స్పందించడం కొసమెరుపు. 🇺🇸 ÉCART CIVILISATIONNEL : 20/07/2023 Une Afro-américaine à bord d'un vol @SpiritAirlines urine sur le sol parce qu'elle ne veut pas attendre qu'ils ouvrent les toilettes après le décollage. Les hôtesses de l'air, quant à elles, lui disent qu'elle devrait boire de l'eau "parce… pic.twitter.com/EQbPGy0NFK — Valeurs Occidentales (@ValOccidentales) July 21, 2023 ఇది కూడా చదవండి: భారత సైనికులకు ఇటలీ ఘన నివాళి -
విమానంలో గబ్బిలం.. పరుగులెత్తిన ప్రయాణికులు
-
విమానంలో గబ్బిలం.. పరుగులెత్తిన ప్రయాణికులు
తాము ప్రయాణిస్తున్న విమానంలో గబ్బిలం కనిపించడం ప్రయణికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటన నార్త్ కరోలినా నుంచి న్యూజెర్సీకి వెళ్తున్న స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు ట్విటర్లో షేర్ చేశాడు. ఈ ఏడాది ఇలా జరగడం ఇది రెండోసారి అని.. మళ్లీ తాను స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణం చేయబోనని సదురు వ్యక్తి పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానంలో గబ్బిలాన్ని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అది తమపై ఎక్కడ వాలుతుందోనని భయపడ్డారు. దాదాపు 30 నిమిషాల సేపు అది విమానంలో అటు ఇటూ తిరుగుతూనే ఉంది. కొందరైతే భయంతో పరుగులు పెట్టారు. మరికొందరైతే గబ్బిలం బారిన పడకుండా ఉండటానికి వాష్‌రూమ్‌ల్లో దూరి లాక్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. -
విమానంలో వేధింపులు... ఎన్ఆర్ఐ అరెస్ట్
వాషింగ్టన్: విమానంలో సహ ప్రయాణికురాలిని లైంగికంగా వేధించిన కేసులో అమెరికా పోలీసులు భారతీయుడొకరిని అరెస్ట్ చేశారు. ప్రభు రామమూర్తి అనే వ్యక్తి టెక్నాలజీ గ్రూప్‌లో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తూ అమెరికాలో ఉంటున్నారు. ఈయన భార్య తాత్కాలిక వీసాపై వచ్చారు. బుధవారం ఇద్దరూ కలిసి స్పిరిట్ ఎయిర్‌లైన్స్ విమానంలో లాస్‌వెగాస్ నుంచి డెట్రాయిట్కు బయల్దేరారు. రామమూర్తికి ఓ వైపు భార్య, మరో వైపు ఓ యువతి(22) కూర్చుని ఉన్నారు. అయితే, సదరు యువతి నిద్రిస్తున్న సమయంలో రామమూర్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయటంతో మిషిగాన్‌లో విమానం ఆగిన సమయంలో ఫెడరల్ పోలీసులు రామమూర్తిని అరెస్ట్ చేశారు. -
విమానంలో మ్యూజిక్ లొల్లి
విచక్షణ కోల్పోవడానికి, విజ్ఞతను ప్రదర్శించడానికి ఎర్రబస్సు, విమానం తేడా లేదని నిరూపించారు వాళ్లు. విమానంలో సౌండ్ తగ్గించమన్నందుకు ఓ అయిదుగురు మహిళలు.. తోటి ప్రయాణీకులతో గొడవకు దిగారు. బాల్టిమోర్ నుంచి లాస్ ఏంజెల్స్ కు వెళుతున్న ఓ విమానంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మద్యం మత్తులో జోగుతున్న ఐదుగురు మహిళలు బిగ్గరగా సంగీతాన్ని వింటున్నారు. అయితే సౌండ్ తగ్గించమని తోటి ప్రయాణీకులు.. వారికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ బృందం సౌండ్ తగ్గించకపోగా..మరింత పెంచి తోటి ప్రయాణికులను గేలి చేసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రయాణీకులు.. మహిళలపై దాడికి దిగారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు పిడిగుద్దులు కురిపించుకున్నారు. జుట్టు, జుట్టు పట్టి లాక్కున్నారు. ఈ దృశ్యాలను తోటి ప్రయాణికులెవరో సెల్‌ఫోన్ లో చిత్రీకరించి ఇంటర్ నెట్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.