స్నేహితుడిని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
రూ. 1.50 లక్షల విలువైన ఐదు మొబైల్స్ రికవరీ
చిక్కడపల్లి: స్నేహితుని మోసం చేసి రూ. 1.50 లక్షల విలువైన మొబైల్ ఫోన్లను దొంగిలించి పరారైన బి.టెక్. చదివిన యువకుణ్ణి చిక్కడపల్లి క్రై మ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ మంత్రి సుదర్శన్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ మారుతీ నందీశ్వర్‌బాబ్జీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన ఉదయ్ కిరణ్ (27) బి.టెక్. పూర్తిచేసి దిల్‌సుక్‌నగర్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో మొబైల్ షాపులలో పనిచేసేవాడు. ఇటీవల విద్యానగర్‌కు చెందిన తన స్నేహితుడు రాజ్‌కిషోర్ వద్దకు వచ్చి తనకు ఉద్యోగం లేదని షెల్టర్ ఇవ్వాలని కోరాడు.
చిక్కడపల్లిలోని లాట్‌మొబైల్ కంపెనీ లో రాజ్‌కిషోర్ పనిచేస్తున్న విషయం తెలుసుకుని కస్టమర్లు అడుగుతున్నారని 5 మొబైళ్లు తేవాలని సూచించాడు. అతని మాటలు నమ్మిన రాజ్‌కిషోర్ రెండు విలువైన ఐ ఫోన్లు , 3 స్యామ్‌సంగ్ ఫోన్లు ఇంటికి తేగా కస్టమర్లకు విక్రయిస్తానని చెప్పి ఫోన్లతో ఉడాయించాడు. ఈ నెల 16న ఈ సంఘటన చోటుచేసుకోగా 26న బాధితుడు ఫిర్యాదు చేశాడు. సోమవారం పోలీసులు ఉదయ్‌కిరణ్‌ను అరెస్టు చేసి రి మాండ్‌కు తరలించారు. అతని నుంచి 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
చదివింది బీటెక్..చేసేది చీటింగ్
Published Tue, Nov 1 2016 4:15 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement