హైదరాబాద్ (బంజారాహిల్స్) : ఈ నెల 22వ తేదీన గోదావరి పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తూ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకు చెందిన జి. మనస్విని అనే ఎనిమిదేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. గడిచిన మూడు రోజుల నుంచి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మనస్విని బ్రెయిన్‌డెడ్‌తో తుది శ్వాస విడవడంతో.. పాప తల్లిదండ్రులు ఆమె శరీర అవయవాలైన కాలేయం, రెండు మూత్రపిండాలు, గుండె కవాటాలను జీవన్‌దాన్ కార్యక్రమం ద్వారా దానం చేశారు. శనివారం అపోలో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తల్లిదండ్రులు వివరాలు వెల్లడించారు.
బ్రెయిన్‌డెడ్ అయిన ఎనిమిదేళ్ల బాలిక అవయవ దానం
Published Sat, Jul 25 2015 7:47 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement