అతనికి దివ్యాంగురాలైన భార్య, నలుగురు పిల్లలున్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యా యి. అయితే అతని భార్య షరీఫా కొన్నేళ్ల క్రితం ఓ ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. అయితే దివ్యాంగురాలైన షరీఫా భర్తకు చేదోడువాదోడుగా ఉంటోంది. ఈ క్రమంలో నిరంజన్ గత గురువా రం వనవాసం సందర్భంగా ఊళ్లో కోళ్లు అమ్ముడుపోతాయని భావించి వాటిని కొనుగోలు చేయడానికి ద్విచక్రవాహనంపై గ్రామం నుంచి దేవరకొండకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టడంతో నిరంజన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కుటుం బ సభ్యులు అతడిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే రెండు రోజుల పాటు చికిత్స నిర్వహించిన వైద్యులు అతని బ్రెయిన్ డెడ్ అయ్యిందని నిర్ధారించి బంధువులకు తెలిపారు.
ఇదే క్రమంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాలు మరొకరికి దానం చేయడం వల్ల వారికి పునర్జన్మను ప్రసాదించవచ్చునని డాక్టర్లు చెప్పడంతో నిరంజన్ భార్య, కుమారుడు వెంటనే తమ అంగీకారాన్ని తెలిపారు. తమ తండ్రి మరణించిన అతని అవయవాలు మరొకరిని బతికిస్తాయంటే సంతోషమేనని తెలిపారు. దీంతో నిరంజన్ శరీరం నుంచి కిడ్నీలు, లివర్, కళ్లను వైద్యులు సేకరించారు. భర్త మరణంతో నిరంజన్ షరీఫా అనా థైంది. కొడుకులు, బిడ్డలకు పెళ్లిళ్లవడంతో షరీఫా ఇప్పుడు అనామకురాలిగా మారింది. తోటి వారికి సాయపడాలన్న అలాంటి ఉన్నతమైన వ్యక్తులకు ప్రభుత్వం కూడా తోడ్పాటునందించాలని పలు వురు కోరుతున్నారు.