
‘అర్జున్ రెడ్డి’ సినిమాకు ఫిదా కానిది ఎవరు చెప్పండి. ‘అర్జున్ రెడ్డి’ పాత్రలో కనిపించిన ‘విజయ్ దేవరకొండ’ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ‘అర్జున్ రెడ్డి’ సాధించిన సంచలన విజయం తన దిశనే మార్చేసింది. చేతినిండా ఆఫర్లతో బిజీ బిజీగా ఉన్నారు విజయ్. ఆల్రెడీ పట్టాల మీద నాలుగు సినిమాలు ఉన్నాయి. అవి కాకుండా చర్చల దశలో మరికొన్ని ఉన్నాయి. రీసెంట్‌గా విజయ్ దేవరకొండకు శేఖర్ కమ్ముల కథ వినిపించారట.
అన్నీ కుదిరితే ఆ సినిమాను విజయ్ దేవరకొండ హోమ్ ప్రొడక్షన్స్‌లో స్వయంగా నిర్మించొచ్చని సమాచారం. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రంలో హీరో గ్యాంగ్‌లో చిన్న పాత్రలో కనిపించారు విజయ్. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే హీరోగా నటించనుండటం విశేషం.