మమ్మీ, డ్యాడీ మీరే నా బెస్ట్‌..: అర్జున్‌ రెడ్డి! | Vijay Deverakonda tweets about an award function | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 1 2018 2:13 PM | Last Updated on Sun, Jul 14 2019 1:14 PM

Vijay Deverakonda tweets about an award function - Sakshi

గత ఏడాది ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో విజయ్‌ దేవరకొండ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఊపిరినిచ్చింది. రియలిస్టిక్‌ కథను అంతే సహజంగా తెరపై ఆవిష్కరిస్తే.. అది తప్పకుండా ప్రేక్షకులకు చేరుతుందని, సినిమా సూపర్‌హిట్‌ అవుతుందని.. అర్జున్‌రెడ్డి చిత్రం నిరూపించింది. ఈ సినిమాతో సూపర్‌స్టార్‌గా ఎదిగిన విజయ్‌ దేవరకొండకు ప్రశంసలు ముంచెత్తుతున్నాయి. తాజాగా ఓ చానెల్‌ నిర్వహించిన అవార్డుల ఫంక్షన్‌లో అర్జున్‌రెడ్డి సినిమాకుగాను విజయ్‌ దేవరకొండను అవార్డు వరించింది. ఈ అవార్డును అందుకుంటున్న ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టుచేసిన విజయ్‌ ఆసక్తికరమైన కామెంట్‌ చేశారు.

‘ఒకవైపు చిరునవ్వుతో నాన్న.. మరోవైపు నవ్వులు చిందిస్తూ మెగాస్టార్‌.. ఇంతకన్నా గొప్ప సంవత్సరం ఏముంటుంది’ అంటూ చిరంజీవి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్న ఫొటోను విజయ్‌ దేవరకొండ ట్వీట్‌ చేశారు. అమ్మ, నాన్న.. మీ ఇద్దరు బెస్టెస్ట్‌.. మీ ఆనందం కోసం ఏమైనా చేస్తాను’ అంటూ అమ్మనాన్నలతోపాటు కలిసి అవార్డు అందుకుంటున్న ఫొటోను పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement