![Vijay Devarakonda Filmfare Award Was Auctioned At 25 Lakhs - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/15/vijay1.jpg.webp?itok=_LaswfTl)
అర్జున్ రెడ్డి సినిమా విడుదలై చాలా రోజులు అవుతున్నా.. దీని ఫీవర్ మాత్రం అంత ఈజీగా తగ్గడం లేదు. ఈ మధ్య వచ్చిన ఆర్‌ఎక్స్ 100 సినిమా అర్జున్ రెడ్డిలా ఉందంటూ పోల్చేస్తున్నారు. అంతగా ‘అర్జున్ రెడ్డి’ టాలీవుడ్‌పై తన ముద్రను వేశాడు. అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవరకొండ నటించిన తీరుకు ఆశ్చర్యపోవాల్సిందే.
అర్జున్ రెడ్డి పాత్రకు గాను ఉత్తమ నటుడిగా తను అందుకున్న మొదటి ఫిలింఫేర్ అవార్డను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ అవార్డును వేలం వేయగా దివి ల్యాబరేటరీస్ సొంతం చేసుకుంది. వేలం వేయగా వచ్చిన 25లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేశారు విజయ్ దేవరకొండ. గతకొన్ని రోజులుగా ఒంటిపై షర్ట్ లేకుండా కేవలం జీన్స్ వేసుకుని ఉన్న ఫోటోలను షేర్ చేస్తోన్న విజయ్.. ‘రౌడీ వియర్స్’ బ్రాండెడ్ జీన్స్‌ను ఆదివారం లాంచ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment