
అర్జున్ రెడ్డి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అర్జున్ రెడ్డి పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా మొదటి సినిమాతోనే తిరుగులేని విజయం సాధించాడు. ఈ సినిమాను రీమేక్ చేసేందుకు బాలీవుడ్, కోలీవుడ్‌లు ముందుకు వచ్చాయి.
కోలీవుడ్‌లో విక్రమ్ తనయుడు ధృవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ..విలక్షణ దర్శకుడు బాలా తమిళ్‌లో అర్జున్ రెడ్డిని ‘వర్మ’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో ఈ సినిమాను షాహిద్ కపూర్ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ టైటిల్‌తో.. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్‌లో ప్రారంభం కానుందని, అంతే కాకుండా.. వచ్చే ఏడాది జూన్ 21న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
#BreakingNews: #ArjunReddy to release on 21 June 2019... Stars Shahid Kapoor... Directed by Sandeep Vanga... Produced by Bhushan Kumar, Murad Khetani, Krishan Kumar and Ashwin Varde... Filming begins Aug 2018... Remake of Telugu hit #ArjunReddy.
— taran adarsh (@taran_adarsh) 31 July 2018