
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల, ఇటీవల తన పుట్టిన రోజు సందర్బంగా ‘మనసు చెప్పింది’ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వీడియోకు సినీపప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వెళ్లువెత్తాయి. తాజాగా యంగ్ హీరో విజయ్ ఆమె ఆలోచనలను ఆచరణలో పెట్టి చూపించాడు. తన మనసు నిద్రపొమ్మని చెప్పిందని, అందుకే షూటింగ్ క్యాన్సిల్ అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌తో పాటు ఓ ఫొటోనూ కూడా షేర్ చేశాడు విజయ్. ఈ పోస్ట్‌ను మంచులకు ట్యాగ్ చేసి తను తన హార్ట్ ను ఫాలో అవుతున్నట్టుగా తెలిపాడు.
అర‍్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. కథ ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న విజయ్, ప్రస్తుతం పరుశురాం దర‍్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మహానటి సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నాడు.
Shoot cancelled, Heart said go back to sleep 😊#FollowYourHeart @ManjulaOfficial pic.twitter.com/28uVzD6YTy
— Vijay Deverakonda (@TheDeverakonda) 9 November 2017
Comments
Please login to add a commentAdd a comment