
సంక్రాంతి మెమరీస్ పెద్దగా లేవు. ఎందుకంటే మేం పెద్దగా సెలబ్రేట్ చేసుకోం. ఇక్కడికొచ్చాకే (హైదరాబాద్) సంక్రాంతి గురించి తెలిసింది. ‘అర్జున్ రెడ్డి’ చేస్తున్నప్పుడు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూశాను. చక్కెర పొంగలి చాలా టేస్టీగా అనిపించింది. ఫెస్టివల్ టైమ్‌లో ఎక్కడ చూసినా గాలిపటాలే. ఇంత బాగా ఎగరేస్తారని నాకు తెలీదు. లాస్ట్ ఇయర్ తెలుగు సినిమా చేస్తే.. ఈ ఇయర్ తమిళ సినిమా ‘100% కాదల్’ (తెలుగు ‘100% లవ్) రీమేక్) షూటింగ్‌లో ఉన్నాను.
ఈ సెట్స్‌లో పొంగల్ (సంక్రాంతి) సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ విధంగా తమిళనాడులో ఎలా పండగ చేస్తారో తెలిసింది. నేను ఆర్టిస్ట్ అవ్వడంవల్లనే అన్ని సంప్రదాయాలు తెలుసుకోగలుగుతున్నాను. ఇక్కడి అమ్మాయిని అనే ఫీల్ కలుగుతోంది. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన నన్ను ఇక్కడివారు తమ అమ్మాయిలా ఆదరిస్తున్నారు. అందుకు ధన్యవాదాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
Comments
Please login to add a commentAdd a comment