
నా ప్రాణమే పాటలో షాలిని పాండే
సాక్షి, సినిమా : థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన షాలిని పాండే.. అర్జున్ రెడ్డి చిత్రంతో యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ప్రీతి పాత్రలో ఆమె ఇచ్చిన ఫెర్‌ఫార్మెన్స్ దెబ్బకు మిగతా భాషల్లో కూడా అవకాశాలు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే షాలిని ఇప్పుడు మరో రూట్‌లోకి వెళ్లి సింగర్ అవతారం ఎత్తింది.
ప్రేమికుల రోజు ప్రత్యేకం ‘నా ప్రాణమే’ అంటూ ఓ స్పెషల్ వీడియో ఆల్బమ్‌లో కోసం తన గళం వినిపించింది. పాప్ రాక్ బ్యాండ్ ‘లగోరీ’ కంపోజ్ చేసిన ఈ పాటలో షాలిని గాత్రం ఆకట్టుకుంది. ఈ పాటకు సంబంధించిన చిన్న టీజర్‌ను నెట్‌లో వదిలారు. చాలా కాన్ఫిడెంట్‌తో షాలిని పాటను పాడగా.. అద్భుతంగా ఉన్న ఆమె గాత్రం... అందుకు తగ్గట్లే మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ పూర్తి పాటను విడుదల చేయనున్నారు.
చూస్తుంటే సింగర్‌గా కూడా ఆమె సక్సెస్ అవుతుందనే అనిపిస్తోంది. ఇక సినిమాల పరంగా చూసుకుంటే సావిత్రి బయోపిక్ మహానటితోపాటు, కోలీవుడ్‌లో 100% లవ్ రీమేక్‌లో షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment