ద్వారకా చిత్రంలో ఓ దృశ్యం
సినిమా: టాలీవుడ్‌లో క్రేజీ కథానాయకుడిగా వెలుగొందుతున్న యువ నటుడు విజయ్‌దేవరకొండ. అక్కడ ఈయన సినీ జీవితంలో అర్జున్‌రెడ్డి చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అంత సంచలన విజయాన్ని ఆ చిత్రం సాధించింది. ఇప్పుడు అదే చిత్రం విక్రమ్ వారసుడు ధ్రువ్ హీరోగా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాత విజయ్‌దేవరకొండ నటించిన గీతగోవిందం చిత్రం కూడా ఘన విజయాన్ని సాధించింది. ఆయన నటించిన మరో చిత్రం ద్వారకా. ఇందులో విజయ్‌దేవరకొండకు జంటగా నటి పూజాజవేరి నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాశ్‌రాజ్, బాహుబలి ప్రభాకర్, మురళీశర్మ, సురేఖవాణి పృథ్వీరాజ్ నటించారు.
శ్రీనివాస రవీంద్ర కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి శ్యామ్ కే.నాయుడు ఛాయాగ్రహణం, సాయ్‌కార్తీక్ సంగీతాన్ని అందించారు. ఇప్పుడీ చిత్రాన్ని జీఆర్.వెంకటేశ్ భాగ్య హోమ్స్ సంస్థ సమర్పణలో శ్రీలక్ష్మీజ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్.బాలాజి తమిళ ప్రేక్షకులకు అర్జున్‌రెడ్డి పేరుతో అందించనున్నారు. ఈయన ఇంతకు ముందు నంబర్ 1, బిజినెస్‌మెన్, హలో వంటి చిత్రాలను అనువదించారు. అర్జున్‌రెడ్డి చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఈ చిత్రం తెలుగులో ద్వారకా పేరుతో రూపొంది మంచి విజయాన్ని సాధించిందన్నారు. తెలుగులో విజయ్‌దేవరకొండ నటించిన అర్జున్‌రెడ్డి చిత్రం సంచలన విజయాన్ని సాధించిందని తెలిపారు. అదేవిధంగా ఆయన నోటా చిత్రంతో నేరుగా కోలీవుడ్‌కు ప్రేక్షకులకు దగ్గర అయ్యారని, తాజాగా తమ అర్జున్‌రెడ్డి తమిళ ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా ఉంటుందని చెప్పారు. ప్రేమ, యాక్షన్ అంటూ కమర్శియల్ ఫార్ములాలో తెరకెక్కిన అర్జున్‌రెడ్డి చిత్రం తమిళ ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణను పొందుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత బాలాజి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment