
సినీరంగం సక్సెస్ వెంటే పరిగెడుతుంది. అందుకే ఒక్క హిట్ ఇచ్చిన దర్శకుడు వెంటనే బిజీ అయిపోతాడు. అదే ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తే ఆ దర్శకుడి రేంజే మారిపోతుంది. అలా టాలీవుడ్‌కు సెన్సేషన్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తొలి చిత్రం అర్జున్ రెడ్డితో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు సందీప్. ఈ సినిమా సక్సెస్‌తో అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ఆఫర్‌తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబుతోనూ సినిమా చేసే చాన్స్‌కొట్టేశాడు.
అయితే ఇంత క్రేజ్ ఉన్న దర్శకుడికి నో చెప్పాడు యంగ్ హీరో శర్వానంద్. అసలు అర్జున్ రెడ్డి సినిమా శర్వానంద్ చేయాల్సింది. కథ నచ్చినా కొన్ని కారణాలవల్ల శర్వా ఆ సినిమా చేయలేదు. అయితే తరువాత మరో కథతో సందీప్.. శర్వాను కలిసినా ఆ ప్రాజెక్ట్‌కు కూడా నో చెప్పాడట శర్వానంద్. ప్రస్తుతం పడి పడి లేచే మనసు సినిమా ప్రమోషన్‌లో భాగంగా శర్వానంద్ ఈ విషయాన్ని వెల్లడించాడు. తనకు కథ నచ్చటంతో పాటు. ఆ క్యారెక్టర్‌లో తాను కంఫర్టబుల్‌గా ఫీల్ అయితేనే నటిస్తానని క్లారిటీ ఇచ్చాడ శర్వానంద్.
శర్వానంద్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పడి పడి లేచే మనసు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియో ఇప్పటికే మంచి సక్సెస్ సాధించటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment