జూనియర్‌ దేవరకొండ సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ..! | Vijay Devarakonda Brother Debut Film Launch | Sakshi
Sakshi News home page

Sep 28 2018 11:12 AM | Updated on Sep 28 2018 11:12 AM

Vijay Devarakonda Brother Debut Film Launch - Sakshi

అర్జున్‌ రెడ్డి సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారిపోయిన హీరో విజయ్‌ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం సినిమాల సక్సెస్‌ తో విజయ్‌ దేవరకొండ ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో తన తమ్ముడిని కూడా హీరోగా పరిచయం చేస్తున్నాడు.

విజయ్‌ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా సినిమా ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. సీనియర్‌ హీరో రాజశేఖర్‌ చిన్న కూతురు శివాత్మిక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా అక్టోబర్‌ 10న ప్రారంభం కానుంది. షార్ట్‌ ఫిలింస్‌తో సత్తా చాటిన కేవీఆర్‌ మహేంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను సురేష్‌ బాబు సమర్పణలో యష్‌ రంగినేని, మధుర శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement