బాలీవుడ్ ‘అర్జున్‌ రెడ్డి’గా..! | Arjun Kapoor in Arjun reddy Bollywood Remake | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 16 2018 3:24 PM | Last Updated on Tue, Jan 16 2018 3:24 PM

Arjun Kapoor in Arjun reddy Bollywood Remake - Sakshi

గత ఏడాది టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సినిమా అర్జున్‌ రెడ్డి. ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయిన అర్జున్‌ రెడ్డి కాసుల పంట పండించటంతో ఇతర భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే కోలీవుడ్‌ లో బాల దర్శకత్వంలో హీరో విక్రమ్‌ వారసుడు ధృవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ పై కూడా క్లారిటీ వచ్చింది. బాలీవుడ్ యువ నటుడు అర్జున్‌ కపూర్ హీరోగా అర్జున్‌ రెడ్డి సినిమాను రీమేక్ చేయనున్నారు. అంతేకాదు ఈ సినిమాను తెలుగు వర్షన్ కు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనే తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు అర్జున్‌ కపూర్‌ సహ నిర్మాతగానూ వ్యవహరించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement