‘అర్జున్‌ రెడ్డి’ ఇంటికి వెళ్లిన కేటీఆర్‌! | KTR Went To Vijay Devarakonda Home for Lunch | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 24 2018 9:02 PM | Last Updated on Sun, Jul 14 2019 1:14 PM

KTR Went To Vijay Devarakonda Home for Lunch - Sakshi

అర్జున్‌రెడ్డి సినిమాతో విజయ్‌ దేవరకొండ ఓవర్‌నైట్‌ స్టార్‌గా ఎదిగారు. సినిమా విడుదలై ఏడాది గడుస్తున్నా.. ఇంకా అర్జున్‌ రెడ్డిని మర్చిపోలేక పోతున్నారు సినీ జనాలు. అర్జున్‌ రెడ్డి నటనకు గానూ విజయ్‌ దేవరకొండ ఫిలింఫేర్‌ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయంపై కేటీఆర్‌ స్పందిస్తూ విజయ్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు.

తాజాగా కేటీఆర్‌ విజయ్‌ దేవరకొండ ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని విజయ్‌ ట్విటర్‌ ద్వారా తెలుపుతూ.. మీ ఇంటికి లంచ్‌ చేయడానికి మీకు ఇష్టమైన నాయకుడు వస్తే ఎలా ఉంటుంది? ఒక్క నిమిషం.. అసలు ఏం జరుగుతోంది బాసూ.. బేసికల్లి ఏమైనా జరుగొచ్చు. మనకు నచ్చిన పనిని చేసుకుంటూ వెళ్లడమే...అంటూ ఆనందంతో కూడిన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement