
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగాని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా టాలీవుడ్‌లో ఎంతటి సంచలన సృష్టించిందో అందరికి తెలిసిందే. ఎన్నో వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన అర్జున్ రెడ్డి తరువాత ఘన విజయం సాధించటంతో అర్జున్ రెడ్డి రీమేక్ కోసం భారీ ఆఫర్‌లు వచ్చాయి. ఈ సినిమా తమిళ రీమేక్‌తో విక్రమ్ తనయుడు ధ్రువ్ వెండితెరకు పరిచయం అవుతున్నాడు.
వర్మ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాల దర్శకుడు. చెన్నై తో పాటు నేపాల్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంత కార్యక్రమాలు జరుపుకుంటున్న వర్మ టీం త్వరలో ఆడియో రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌కు సందీప్ రెడ్డి వంగానే దర్శకత్వం వహిస్తుండగా షాహిద్ కపూర్ గా హీరోగా నటించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment