
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల విడుదల సంచలన విజయం సాధించిన చిత్రం అర్జున్‌రెడ్డి. ముఖ్యంగా వివాదాలతోనే కావాల్సినంత ప్రచారం దొరికిన ఈ మూవీని తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా దర్శకుడు రాంగోపాల్‌వర్మ ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఆమూవీ విడుదలైనప్పుడు అద్భుతమైన మూవీ అని, హీరో విజయ్ దేవరకొండ నటన సూపర్ అంటూ మెచ్చుకున్న ఆర్జీవీ.. తాజాగా అర్జున్‌రెడ్డి మూవీ సూపర్ ఫ్లాప్ అని కామెంట్ చేశారు.
అదేంటి ఇంతలో వర్మ రూట్ మార్చాడా అనుకుంటున్నారా.. ఆ వివరాలపై ఓ లుక్కేయండి. అర్జున్‌రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా ఇటీవల ఆర్జీవీని కలుసుకున్నాడు. మరో విభిన్న కథాంశంతో తాను తెరకెక్కించనున్న లేటెస్ట్ మూవీ స్టోరీని సీనియర్ డైరెక్టర్ ఆర్జీవీకి వివరించాడు. దీనిపై స్పందించిన వర్మ.. ‘సందీప్ నాకు లేటెస్ట్ మూవీ స్టోరీ వినిపించాడు. నాకు చాలా ఈర్ష్యగా ఉంది. ఈ సినిమా కథతో పోలిస్తే గత చిత్ర అర్జున్‌రెడ్డి సూపర్ ఫ్లాప్. సందీప్ కొత్త సినిమా మెగా సక్సెస్ అవుతుంది. అందుకే అర్జున్‌రెడ్డి ఫ్లాప్ అనిపిస్తుందని’ సందీప్‌తో కలిసి దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ’లక్ష్మీస్ ఎన్టీఆర్’తో బిజీగా ఉన్న డైరెక్టర్ వర్మ.. టాలీవుడ్ మన్మథుడు నాగార్జునతో మరో ప్రాజెక్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.