
టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన బోల్డ్ లవ్ స్టోరి అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ, శాలినీ పాండే హీరో హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసింది. దీంతో తమిళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. తెలుగు వర్షన్‌కు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా హిందీ వర్షన్ తెరకెక్కిస్తున్నాడు. కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజాగా తెలుగు అర్జున్ రెడ్డి విజయ్, హిందీ ప్రీతి కియారాలు ఓ ఈవెంట్‌లో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబైలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ ఈవెంట్‌లో విజయ్, కియారా అద్వాని కలిశారు. బాలీవుడ్ టాప్ స్టార్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ హాటెస్ట్ స్టైలిస్ట్‌గా అవార్డు అందుకున్నాడు. విజయ్ తోపాటు షారూఖ్ ఖాన్ దంపుతులు, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, కరీనా కపూర్, కత్రినా కైఫ్ లతో పాటు మరికొంతమంది బాలీవుడ్ యంగ్ స్టార్స్ ఈకార్యక్రమంలో సందడి చేశారు.
This ones for you @imvangasandeep When Preeti Met Arjun 😎 Hey Rowdy! @TheDeverakonda pic.twitter.com/zxQaQbNoTV
— Kiara Advani (@Advani_Kiara) 30 March 2019
Comments
Please login to add a commentAdd a comment