
విజయ్ దేవరకొండ హీరో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన సెన్సేషనల్ హిట్ సినిమా అర్జున్ రెడ్డి. ఈ ఒక్క సక్సెస్‌తో విజయ్ స్టార్‌గా మారిపోయాడు. అంతేకాదు దర్శకుడు సందీప్ రెడ్డికి కూడా అర్జున్ రెడ్డి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది. అర్జున్ రెడ్డి ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాలో తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు.
వర్మ పేరుతో తెరకెక్కుతున్న తమిళ వర్షన్ టీజర్ ఇటీవలే రిలీజ్ అయ్యింది. హిందీ వర్షన్ షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. ఒరిజినల్ వర్షన్ దర్శకుడు సందీప్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు కబీర్ సింగ్ అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ సినిమాలో భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment