
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ రేంజ్‌లో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప-2 చిత్రంపైనే దృష్టి సారించారు. ఇటీవలే రాజస్థాన్ వేకేషన్‌కు వెళ్లిన బన్నీ అక్కడి దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరలయ్యాయి. అయితే తాజాగా బన్నీకి సంబంధించి ఓ వార్త తెగ వైరలవుతోంది. రెమ్యూనరేషన్ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్‌ను దాటేశారని టాక్ వినిపిస్తోంది. సందీప్ వంగా డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న తొలి హిందీ మూవీకి ఐకాన్ స్టార్ భారీ మొత్తాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం.
ఒకవేళ అదే జరిగితే ప్రభాస్‌ను వెనక్కినెట్టి అత్యధిక రెమ్యూనరేషన్‌గా అందుకున్న టాలీవుడ్ హీరోగా నిలుస్తారు. టీ సిరీస్ ప్రొడక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.125 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా.. బన్నీ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని సమాచారం. ఇటీవలే సందీప్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్‌లతో అల్లు అర్జున్ పనిచేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. సందీప్‌రెడ్డితో కలిసి సూపర్ హిట్ సినిమా అందిస్తామని అల్లు అర్జున్ ట్వీట్ కూడా చేశారు.
Been looking forward for this combination for quite some time now . @imvangasandeep garu’s magic is something that personally touches me . Hopefully we give a memorable film that will be remembered for a long long time . pic.twitter.com/i24uOyoFkI
— Allu Arjun (@alluarjun) March 4, 2023