Kareena Kapoor Plays As Negative Role In Prabhas movie - Sakshi
Sakshi News home page

Kareena Kapoor: ప్రభాస్‌ సినిమాలో విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌

Published Wed, Oct 20 2021 5:33 PM | Last Updated on Wed, Oct 20 2021 10:35 PM

Kareena Kapoor Plays As Negative Role In Prabhas And Sandeep Vanga Movie - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ 25వ చిత్రం అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి  ‘స్పిరిట్‌’ అనే పేరును ఖరారు చేసి ఇటీవల అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు మేకర్స్‌. టీ సిరీస్‌, వంగా పిక్చర్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. 

చదవండి: Prabhas25: 'అర్జున్‌రెడ్డి' డైరెక్టర్‌తోనే ప్రభాస్‌ 25వ చిత్రం

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ ‘బెబో’ కరీనా కపూర్‌ నటిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరీనా ప్రభాస్‌ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతోందట. తొలి చిత్రంలోనే బెబో నెగిటివ్‌ షేడ్‌లో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోందట. ఇందులో ఆమె లేడీ విలన్‌గా కనిపించనుందని చెబుతున్నారు. 

చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత

ఈ చిత్రంలో హీరో పాత్రకు ధీటుగా శక్తివంతంగా కరీనా పాత్ర ఉండబోతుందట. కాగా ఈ చిత్రంలో ప్రభాస్‌ పవర్‌ ఫుల్‌ పోలీసు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్‌, కొరియన్‌, జపాన్‌ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.ఇప్పటికే బాహుబలి చిత్రంలో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌ ఈసారి పాన్‌ వరల్డ్‌ స్టార్‌గా మారనున్నారు. ఇలాంటి అరుదైన  రికార్డ్‌ను సాధించిన తొలి తెలుగు హీరోగా ప్రభాస్‌ నిలవనున్నారు.

చదవండి: ఘనంగా ముక్కు అవినాష్‌ పెళ్లి, ‘బ్లండర్‌ మిస్టేక్‌’ అంటూ వీడియో బయటికి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement