ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన స్క్విడ్‌గేమ్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణను నోచుకుంది. స్క్విడ్‌గేమ్‌ను చూసేందుకు ఓటీటీ ప్రియులు ఎగబడుతున్నారు. గత నెల 17న రిలీజైన స్క్విడ్‌గేమ్ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ డ్రామా సిరీస్‌గా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన 28 రోజుల్లో ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల మంది వీక్షించారు.
చదవండి: రెండు రోజుల్లో రూ. 1100 కోట్లు
భారీగా పెరిగిన సబ్‌స్క్రిప్షన్స్...!
దక్షిణకొరియన్ వెబ్‌సిరీస్ స్క్విడ్‌గేమ్ రాకతో నెట్‌ఫ్లిక్స్ దశనే మార్చేసింది. కంపెనీ ఊహించని రీతిలో కొత్త కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్ తలుపును తట్టారు. జూలై నుంచి సెప్టెంబర్‌లో సుమారు 4. 38 మిలియన్ల కొత్త కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్‌ను సబ్‌స్రైబ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. స్క్విడ్‌గేమ్ సిరీస్‌తోనే భారీగా కొత్త సబ్‌స్క్రిప్షన్స్ పెరిగినట్లు నెట్‌ఫ్లిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
కోవిడ్ రాకతో ఓటీటీ ఇండస్ట్రీలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఒక్కసారిగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల సంఖ్య భారీగా పెరిగింది. 2020 ప్రథమార్థంలో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల సంఖ్య దూసుకుపోయింది. ఈ సమయంలో ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ప్రైమ్, హట్‌స్టార్ డిస్నీ, హెచ్‌బీవో మ్యాక్స్ మొదలైన వాటికి కాసుల వర్షం కురిసింది. అదే 2021తో పోలీస్తే ఓటీటీ యూజర్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. దక్షిణ కొరియన్ డ్రామా సిరీస్ రాకతో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ల సంఖ‍్య ఇతర ఒటీటీ సంస్థలతో పోలిస్తే అనూహ్యంగా పెరిగింది. సెప్టెంబర్ నాటికి నెట్‌ఫ్లిక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 213.6 మిలియన్ సబ్‌స్క్రిప్షన్స్ ఉన్నాయి.
కలెక్షన్ కింగ్‌గా స్క్విడ్‌గేమ్..!
సెప్టెంబర్ 17న "స్క్విడ్ గేమ్" విడుదలైనప్పటి నుంచి కంపెనీలో షేర్ల విలువ దాదాపు 7 శాతం పెరిగింది. ఇలా సంస్థ విలువ $278.1 బిలియన్లకు చేరుకుంది. ఇటు కొత్త చందాదారులు చేరడం, షేర్లు విలువ భారీగా పెరగడంతో సంస్థ విలువ కూడా భారీగా పెరిగింది.
చదవండి: Ola Electric :ఓలా బైక్, నవంబర్ 10 నుంచి టెస్ట్ రైడ్స్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment