ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురి మృతి
సియోల్: దక్షిణ కొరియాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఉల్సాలోని హన్వా కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం పేలుడు సంభవించింది. దీంతో ఆరుగురు కార్మికులు అక్కడిక్కడే మంటల్లో కాలిబూడిదయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
కెమికల్ ట్యాంక్లోకి దిగి మరమ్మతు పనులు నిర్వహిస్తుండగా పేలుడు జరిగి ఉండొచ్చని అగ్రిమాపక అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఎంతమంది కార్మికులు ఈ మంటల్లో చిక్కుకున్నారు, వారిలో ఎంతమంది బతికి ఉండే అవకాశముందనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు పేలుడుకు సంబంధించిన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.