
మీరు ఎప్పుడైనా ఆక్టోపస్ హాయ్ చెప్పడం చూశారా.. ఒకవేళ చూడకపోతే మాత్రం వెంటనే ఈ వీడియోలో చూసేయండి. ఆక్టోపస్‌లు మనుషులు చేసే పనులు అనుకరిస్తాయని కొంతమంది చెబుతుంటారు. అది నిజామా కాదా అనే విషయం కాసేపు పక్కన పెట్టి ఈ వీడియోనూ గమనించండి. వీడియోలో ఒక వ్యక్తి ఆక్టోపస్‌కు చేతులు ఊపాడు. అది చూసిన ఆక్టోపస్ దానికి ప్రతిస్పందనగా తన చేతులను కూడా ఊపడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపడ్డారు. దాదాపు 7 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో అచ్చం మనిషిలాగానే ఆక్టోపస్ తన చేతులతో హాయ్ చెప్పింది. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అయితే దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు.ఆక్టోపస్ హాయ్ చెప్పడం ఆశ్చర్యంగా కలిగించిందని... ఆక్టోపస్ చాలా తెలివైన జంతువులను,మనుషులను తొందరగా సంగ్రహించే శక్తి ఉంటుందంటూ కామెంట్లు పెట్టారు. కానీ కొందరు మాత్రం దీనిని వ్యతిరేకిస్తూ... అది హాయ్ చెప్పలేదని, దాని మీద ఏదో పడితే అది తీయడానికి అలా చేసిందని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఆక్టోపస్ తాను చేసిన పనికి సోషల్ మీడియాలో ఒక్కసారగా హీరోగా మారిపోయిందనడంలో సందేహం లేదు.
The octopus is one of the most intelligent animals on the planet. Here’s one copying a wave “hello” pic.twitter.com/DUit3H8DBe
— Nature is Lit🔥 (@NaturelsLit) February 22, 2020