భయానక అనుభవం; ఆక్టోపస్‌ను తిందామనుకుంటే.. | Blogger Fight With Octopus Who Tries To Eat That Alive | Sakshi
Sakshi News home page

ఆక్టోపస్‌ను తిందామనుకుంది; బేర్‌మని ఏడ్చింది!

Published Thu, May 9 2019 11:25 AM | Last Updated on Thu, May 9 2019 11:27 AM

Blogger Fight With Octopus Who Tries To Eat That Alive - Sakshi

బతికున్న ఆక్టోపస్‌ను తిందామనుకున్న ఓ యువతికి భయానక అనుభవం ఎదురైంది. ప్రాణాలు రక్షించుకునేందుకు ఆక్టోపస్‌ చేసిన ఎదురుదాడిలో సదరు యువతి ముఖంపై గాయాలయ్యాయి. అసలేం జరిగిందంటే.. ఓ చైనీస్‌ బ్లాగర్‌ ప్రాణాలతో ఉన్న ఆక్టోపస్‌ను తింటూ వీడియో తీసేందుకు ప్రయత్నించింది. దానిని ఎత్తుకుని నోట్లో పెట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఆక్టోపస్‌ తన మీసాలతో ఆమె ముఖాన్ని గట్టిగా పట్టుకుంది. దీంతో దానిని విడిపించుకునేందుకు ఆమె చాలా ప్రయత్నించింది. కానీ అది ఒక పట్టాన వదలకపోవడంతో ఏడుపు లంకించుకుంది. బాధతో విలవిల్లాడుతూ.. చివరకు ఎలాగోలా దానిని వదిలించుకుంది.

కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘అసలు నీకు మతి ఉండే ఇలా చేశావా...  బతికున్న ఆక్టోపస్‌ను తినాలని ఎలా అనుకున్నావు’ అంటూ నెటిజన్లు ఆమె చర్యను తప్పుబడుతున్నారు. ఇంకేం మీరు కూడా వీరిద్దరి ఫైట్‌పై ఓ లుక్కేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement