'జై హనుమాన్‌' ప్రాజెక్ట్‌ను పక్కనపెడుతున్న ప్రశాంత్‌ వర్మ.. కారణం ఇదేనా? | Prasanth Varma Break To Jai Hanuman Movie | Sakshi
Sakshi News home page

'జై హనుమాన్‌' ప్రాజెక్ట్‌కు బ్రేక్‌ ఇస్తున్న ప్రశాంత్‌ వర్మ.. కారణం ఇదేనా?

Published Tue, Mar 19 2024 5:04 PM | Last Updated on Tue, Mar 19 2024 5:18 PM

Prasanth Varma Break To Jai Hanuman Movie - Sakshi

భారీ సినిమాలతో పోటీ పడి ఈ సంక్రాంతి రేసులో విన్నర్‌గా నిలిచిన చిత్రం 'హనుమాన్‌'. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 వేదికగా  తెలుగు వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది.  అయితే హనుమాన్ సినిమాకు సీక్వెల్‌గా 'జై హనుమాన్' ఉంటుందని.. అది 2025లో విడుదల అవుతుందని ప్రశాంత్‌ వర్మ ప్రకటించారు.

'హనుమాన్‌' సినిమాను చూసిన ప్రేక్షకులు అందరూ ఇప్పుడు 'జై హనుమాన్‌' అప్డేట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ తర్వాత ఆయన తీయబోయే సినిమా 'జై హనుమాన్‌' ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కానీ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం అది కాదని తెలుస్తోంది. జై హనుమాన్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆయన అనుకున్న నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఈ విషయంలో మరికొంత సమయం పడుతుందని సమాచారం. దీంతో ఆయన డైరెక్ట్‌ చేసి పెండింగ్‌లో ఉన్న మరో ప్రాజెక్ట్‌ను మళ్లీ పట్టాలెక్కించాలని ఉన్నారట. ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్‌ జరుపుకున్న 'ఆక్టోపస్‌' సినిమాపై ఆయన ఫోకస్‌ పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్‌తో తెరకెక్కనుందని టాక్‌. ఇందులో ఐదుగురు మహిళా క్యారెక్టర్‌ల చుట్టూ కథ నడుస్తుందని గతంలో ప్రశాంత్‌ వర్మ తెలిపారు. ఇందులో ఒక పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇండిస్ట్రీలో ప్రచారం జరుగుతున్నట్లు జై హనుమాన్‌ ప్రాజెక్ట్‌కు కాస్త బ్రేక్‌ ఇచ్చి 'ఆక్టోపస్‌' చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడా అనే విషయంపై ప్రశాంత్‌ వర్మ క్లారిటీ ఇస్తే గానీ అసలు విషయం ఎవరికీ తెలియదు.  అనుపమ కూడా గతంలో లేడి ఓరియెంటెడ్‌ చిత్రమైన  బటర్ ఫ్లై ద్వారా ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.. త్వరలో ఆమె డీజే టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే లైన్‌లో ప్రశాంత్‌ వర్మ ఆక్టోపస్‌ చిత్రం కూడా త్వరగా పూర్తి చేసుకుని థియేటర్‌లోకి వస్తే ఈ బ్యూటీకి మరో కొన్ని ప్రాజెక్ట్‌లు వచ్చే ఛాన్స్‌ ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement