'మాటిస్తున్నా.. అంతకుమించి'.. హనుమాన్‌ డైరెక్టర్‌ ట్వీట్! | Hanu Man Director Prashanth Varma Shares New Poster Of New Film | Sakshi
Sakshi News home page

Prashanth Varma: 'ఇంతకు ముందు ఎప్పుడు చూసి ఉండరు'.. ప్రశాంత్‌ వర్మ క్రేజీ అప్‌డేట్‌..!

Apr 17 2024 11:14 AM | Updated on Apr 17 2024 11:50 AM

Hanu Man Director Prashanth Varma Shares New Poster Of New Film - Sakshi

ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరెకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ కలెక్షన్ల వర్షం కురిపించింది. సంక్రాంతి రిలీజై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీ పడి రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. హనుమాన్ సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రాని సీక్వెల్‌ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉ‍న్నారు.

ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు ప్రశాంత్. సీక్వెల్‌గా వస్తోన్న జై హనుమాన్‌ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. హనుమాన్‌ కంటే అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపారు.  ఈ పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా మీకు మాటిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

కాగా.. జై హనుమాన్‌ చిత్ర పనులు ఏడాది కిందటే మొదలు పెట్టామని ప్రశాంత్ వర్మ ఇటీవల తెలిపారు. కథ సిద్ధంగా ఉందని.. ఎలా తీయాలో అన్న విషయంపై ఇంకా వర్క్ జరుగుతోంది. వీఎఫ్‌ఎక్స్‌తో పాటు మిగిలిన వాటిపై ఓ క్లారిటీ రాగానే షూటింగ్‌ మొదలవుతుందన్నారు. రాబోయే సినిమాల నాణ్యత విషయంలో అస్సలు రాజీపడది లేదని ప్రశాంత్‌ వర్మ చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement