సజీవంగా ఉండాలంటే ప్రతీ జీవికి గుండె ఎంతో అవసరం. గుండె అనేది శరీరం అంతటికీ రక్తం సరఫరా చేయడంతోపాటు పలు విధులు నిర్వహిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఒకటి కన్నా ఎక్కువ గుండెలు కలిగిన జీవుల గురించి తెలుసుకుందాం.
ఈ ప్రపచంలో అనేక జీవజాతులు ఉన్నాయి. వీటిలో కొన్ని భూమిపైన, కొన్ని భూమి కింద, మరొకొన్ని చెట్ల మీద నివాసం ఏర్పరుచుకుంటాయి. వీటిలో కొన్ని జీవులకు రెండు లేదా అంతకన్నా ఎక్కువ గుండెలు ఉంటాయి. వీటిలో ఆక్టోపస్‌కు 3 గుండెలు ఉంటాయనే సంగతి చాలామందికి తెలుసు. అయితే ఆక్టోపస్‌తోపాటు మరి ఏ జీవులకు అత్యధిక గుండెలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆక్టోపస్
ఇది సముద్ర జీవి దీనికి 3 గుండెలు, 8 కాళ్లు ఉంటాయి. దీని రక్తం నీలి రంగులో ఉంటుంది. దీని జీవిత కాలం 6 నెలలు మాత్రమే అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
స్క్విడ్
ఈ చేప చూసేందుకు ఆక్టోపస్ మాదిరిగానే కనిపిస్తుంది. దీనికి కూడా 3 గుండెలు ఉంటాయి. దీనిలో ఒక గుండె దాని శరీరానికంతటికీ రక్తం సరఫరా చేస్తుంది. మిగిలిన రెండు గుండెలు గిల్స్‌లో ఆక్సిజన్ పంప్ చేస్తాయి. గిల్స్ అనేది చేపకు ఆక్సిజన్ అందించే అవయవం.
ఎర్త్‌వార్మ్
ఎర్త్‌వార్మ్ అంటే వానపాము. ఇది వ్యవసాయదారులకు ఎంతో మేలు చేస్తుంది. దీనికి కూడా పలు గుండెలు ఉంటాయి. దీని హృదయం పనిచేసే విధానాన్ని ‘ఎరోటిక్ ఆర్చ్’ అని అంటారు. ఇది పంపింగ్ ఆర్గాన్ మాదిరిగా పనిచేస్తుంది. శరీరం అంతటికీ ఇది రక్తాన్ని సరఫరా చేస్తుంది.
కాక్రోచ్
కక్రోచ్‌కు ఒకే గుండె ఉన్నప్పటికీ దానికి 13 చాంబర్లు ఉంటాయి. దీని గుండెలోని ఒక చాంబర్‌కు గాయమైతే, మిగిలిన చాంబర్లు యాక్టివేట్ అవుతాయి. ఫలితంగా హృదయానికి గాయమైనా అది చనిపోదు.
ఇది కూడా చదవండి: పిల్లాడి టైమ్ టేబుల్.. చదువుకు కేటాయించిన టైమ్ చూస్తే నవ్వాపుకోలేరు!
Comments
Please login to add a commentAdd a comment