
సోచి: ఫిఫా వరల్డ్‌కప్ చూడటానికి రష్యాకు వెళ్లిన ఓ భారత అభిమాని అక్కడ జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. శనివారం పోర్చుగల్, ఉరుగ్వే మ్యాచ్ చూసి వస్తున్న సమయంలో కారు ప్రమాదం జరిగి ఆదిత్య రంజన్ అనే భారత అభిమాని మృత్యువాత పడినట్లు భారత అధికారులు వెల్లడించారు. ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తున్న సోచి నగరానికి సమీప ప్రాంతమైన కూబన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత అభిమాని మరణించిన విషయాన్ని అక్కడ భారత ఎంబసీ అధికారి ఒకరు తెలిపారు.
కారును ఓ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్‌తోపాటు భారత పౌరుడైన రంజన్ కూడా మరణించినట్లు రష్యన్ న్యూస్ ఏజెన్సీ ఆర్‌ఐఏ నోవోస్తి తెలిపింది. ఇదే ప్రమాదంలో గాయపడిన మరో భారతీయుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. బాధితుడి కుటుంబంతో ఎంబసీ టచ్‌లో ఉన్నదని ఆయన చెప్పారు. మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించిన తర్వాత ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment