పీలే తర్వాత ఎంబాపె! | Kylian Mbappe Second Teenager To Score Twice In A World Cup Match | Sakshi
Sakshi News home page

పీలే తర్వాత ఎంబాపె!

Published Sun, Jul 1 2018 12:07 PM | Last Updated on Sun, Jul 1 2018 1:17 PM

Kylian Mbappe Second Teenager To Score Twice In A World Cup Match - Sakshi

మాస్కో: అర్జెంటీనాతో మ్యాచ్‌ ముందు వరకు కైలిన్‌ ఎంబాపె గురించి బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ, ఇప్పుడు ఈ ఫ్రాన్స్‌ ఫుట్‌బాలర్‌ గురించి నెటిజన్లు ఆసక్తిగా గూగ్‌ల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. కీలక మ్యాచ్‌లో రెండు గోల్స్‌ చేసి గత ప్రపంచకప్‌ ఫైనలిస్ట్‌ను ఇంటికి పంపించిన ఈ ఫార్వర్డ్‌ ప్లేయర్‌ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక ప్రపంచకప్‌ మ్యాచ్‌లో రెండు గోల్స్‌ చేసిన  రెండో పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

అంతపుట్‌బాల్‌ దిగ్గజం పీలే (17 సంవత్సరాల 8 నెలల 6 రోజులకు) ఫిపా ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో రెండు గోల్స్‌ చేసిన అతి చిన్న వయస్కుడిగా తొలి స్థానంలో ఉన్నాడు. 1958 సాకర్‌ ఫైనల్‌ సమరంలో స్వీడన్‌పై రెండు గోల్స్‌ చేసి పీలే ఈ ఘనత సాధించాడు. 60 సంత్సరాల అనంతరం ఫ్రాన్స్‌ ఆటగాడు కైలిన్‌ ఎంబాపె (19 సంవత్సరాల 6 నెలల 10 రోజులు) అర్జెంటీనాపై రెండు గోల్స్‌ చేయడంతో అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అర్జెంటీనా- ఫ్రాన్స్‌ మ్యాచ్‌ అనంతరం ఎంబాపెకు  ట్విటర్‌ ద్వారా పీలే అభినందనలు తెలపడం ఇక్కడ మరో విశేషం. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement