
క్రస్లోయార్స్క్: చిలక జోస్యం సంగతేమో కానీ ఫుట్‌బాల్ ప్రపంచ కప్ రాగానే ప్రతీ జంతువుకు జ్యోతిష్య హోదా కట్టబెట్టేస్తున్నట్లున్నారు! ఆక్టోపస్ నుంచి మొదలు పెడితే పిల్లి, డాల్ఫిన్, పంది వరకు అన్ని జంతువులు వరల్డ్ కప్ విన్నర్ ఎవరో తేల్చేస్తున్నాయి. తాజాగా ఈ కోవలో ఎలుగు బంటి కూడా చేరింది. ‘పామిర్’ పేరు గల 11 ఏళ్ల తెల్ల ఎలుగు బంటి ఇప్పుడు బరిలోకి దిగింది.
మంగళవారం జరగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి బెల్జియం విజేతగా నిలుస్తుందని పామిర్ చెబుతోంది. ఈ రెండు దేశాల జాతీయ పతాకాలు ముద్రించిన రెండు క్యాన్లను దీని ముందు ఉంచారు. వీటిలో బెల్జియంను పామిర్ ఎంచుకుంది. వీటిలో ఎన్ని నిజ్జంగా నిజం అయ్యాయనేది పక్కన పెడితే ‘వార్ ఆఫ్ వరల్డ్ కప్ ఎనిమల్స్’గా మారిపోయిందనేది మాత్రం చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment