ఎకతెరీన్‌బర్గ్: నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో స్వీడన్ దుమ్మురేపింది. మెక్సికోతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ లీగ్ మ్యాచ్‌లో స్వీడన్ 3–0తో అద్భుత విజయం సాధించింది. స్వీడన్ తరఫున అగస్టిన్సన్ (50వ ని.లో), గ్రాన్‌క్విస్ట్ (62వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... 74వ నిమిషంలో మెక్సికో ప్లేయర్ అల్వారెజ్ ‘సెల్ఫ్ గోల్’తో స్వీడన్ ఆధిక్యం 3–0కు చేరింది. మరోవైపు కొరియా చేతిలో జర్మనీ ఓడిపోవడంతో ఈ ఓటమి ప్రభావం మెక్సికోపై పడలేదు.
రెండేసి విజయాలు సాధించిన స్వీడన్, మెక్సికో ఆరు పాయింట్లతో గ్రూప్ ‘ఎఫ్’ నుంచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందాయి. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా స్వీడన్ గ్రూప్ ‘టాపర్’గా నిలిచింది. మెక్సికోకు రెండో స్థానం దక్కింది. జర్మనీతో మ్యాచ్‌లో చివరి సెకన్లలో విజయాన్ని చేజార్చుకున్న స్వీడన్ ఈ మ్యాచ్‌లో మాత్రం ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. అయితే తొలి అర్ధభాగంలో రెండు జట్లు గోల్ చేయలేకపోయాయి. రెండో భాగంలో స్వీడన్ చెలరేగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment