knockout tournment
-
సూపర్ స్వీడన్...
ఎకతెరీన్‌బర్గ్: నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో స్వీడన్ దుమ్మురేపింది. మెక్సికోతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ లీగ్ మ్యాచ్‌లో స్వీడన్ 3–0తో అద్భుత విజయం సాధించింది. స్వీడన్ తరఫున అగస్టిన్సన్ (50వ ని.లో), గ్రాన్‌క్విస్ట్ (62వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... 74వ నిమిషంలో మెక్సికో ప్లేయర్ అల్వారెజ్ ‘సెల్ఫ్ గోల్’తో స్వీడన్ ఆధిక్యం 3–0కు చేరింది. మరోవైపు కొరియా చేతిలో జర్మనీ ఓడిపోవడంతో ఈ ఓటమి ప్రభావం మెక్సికోపై పడలేదు. రెండేసి విజయాలు సాధించిన స్వీడన్, మెక్సికో ఆరు పాయింట్లతో గ్రూప్ ‘ఎఫ్’ నుంచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందాయి. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా స్వీడన్ గ్రూప్ ‘టాపర్’గా నిలిచింది. మెక్సికోకు రెండో స్థానం దక్కింది. జర్మనీతో మ్యాచ్‌లో చివరి సెకన్లలో విజయాన్ని చేజార్చుకున్న స్వీడన్ ఈ మ్యాచ్‌లో మాత్రం ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. అయితే తొలి అర్ధభాగంలో రెండు జట్లు గోల్ చేయలేకపోయాయి. రెండో భాగంలో స్వీడన్ చెలరేగిపోయింది. -
అర్జెంటీనా నిలిచింది
అర్జెంటీనా ఊపిరి పీల్చుకుంది! ఒక డ్రా, ఒక ఓటమితో... నాకౌట్ అవకాశాలను పీకల మీదకు తెచ్చుకున్న ఆ జట్టు... ఓ చక్కటి గెలుపుతో ప్రపంచ కప్ లీగ్ దశ గండాన్ని అధిగమించింది. ఢీ అంటే ఢీ అనేలా తలపడే నైజీరియాపై ఆధిపత్యం చాటుతూ లియోనల్ మెస్సీ మైమరపు గోల్ ఆధిక్యం అందించగా... మార్కొస్ రొజొ మెరుపు షాట్ గెలుపును కట్టబెట్టింది. సెయింట్ పీటర్స్బర్గ్: తరుముకొస్తున్న పరాభవాన్ని అర్జెంటీనా తప్పించుకుంది. ‘డ్రా’ సైతం సరిపోనంతగా... గెలుపు అత్యవసరమైన స్థితిలో పైకి లేచింది. కెప్టెన్ మెస్సీ (14వ నిమిషంలో), డిఫెండర్ మార్కొస్ రొజొ (86వ నిమిషంలో) గోల్స్‌తో మంగళవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో 2–1 తేడాతో నైజీరియాను ఓడించి నాకౌట్‌కు చేరింది. నైజీరియా తరఫున మోసెస్ (51వ నిమి షంలో) పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు. ఈ ఫలితంతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన అర్జెంటీనా (4 పాయింట్లు)... గ్రూప్ ‘సి’ విజేత ఫ్రాన్స్‌తో ఈ నెల 30న జరిగే నాకౌట్ మ్యాచ్‌లో తలపడనుంది. మెస్సీ ‘బనేగా’ గోల్... జట్టుగా ఎలా ఉన్నా మైదానంలోకి వచ్చేసరికి అర్జెంటీనాకు మెస్సీనే అన్నీ. దీనిని మరోసారి నిరూపిస్తూ అతడు ప్రారంభంలోనే గోల్ కొట్టి ఆధిక్యం అందించాడు. 14వ నిమిషంలో సహచరుడు బనేగా సుదూరం నుంచి ఇచ్చిన పాస్‌ను అందుకున్న మెస్సీ ముందు దానిని నియంత్రించి, ఆ తర్వాత ప్రత్యర్థి ఆటగాడిని ఏమారుస్తూ ముందుకెళ్లి నేరుగా గోల్‌పోస్ట్‌లోకి కొట్టా డు. ఆధిక్యం కోల్పోయి, జట్టుగా ఆడలేకపోతున్న నైజీరియాకు రెండో భాగంలో అదృష్టం తోడైంది. 49వ నిమిషంలో బాక్స్ లోపల బలోగన్‌ను మాస్కెరనో అడ్డుకోవడంతో ఆ జట్టుకు పెనాల్టీ దక్కింది. దీనిని మోసెస్ పొరపాటు లేకుండా నెట్లోకి పంపాడు. మ్యాచ్ ముగియడానికి నాలుగు నిమిషాలు ఉందనగా కుడి వైపు కార్నర్ నుంచి అందిన పాస్‌ను అందుకున్న రొజొ... అంతే వేగంగా నెట్లోకి పంపి జట్టుకు రెండో గోల్‌తో పాటు అద్భుత విజయాన్ని అందించాడు. గ్రూప్ ‘డి’ టాపర్ క్రొయేషియా రొస్తావ్ ఆన్ డాన్: ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన క్రొయేషియా... గ్రూప్ ‘డి’లో అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం అర్ధరాత్రి ఐస్‌లాండ్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 2–1తో నెగ్గింది. బడెల్జ్ (53వ నిమిషంలో), పెరిసిక్ (90వ ని.లో) క్రొయే షియాకు గోల్స్ చేశారు. మధ్యలో సిగుర్డ్సన్ (76వ ని.లో) పెనాల్టీని గోల్‌గా మలిచి ఐస్లాండ్ను పోటీలో నిలిపాడు. మ్యాచ్ డ్రాగా ముగిసేలా కనిపించినా పెరిసిక్ స్కోరు చేసి ఫలితాన్ని మార్చాడు. ఇంతకుముందే నైజీరియా, అర్జెంటీనాలపై నెగ్గిన క్రొయే షియా ఈ ఫలితంతో గ్రూప్‌లో అజేయంగా నిలిచింది. జూలై 1న నాకౌట్లో డెన్మార్క్‌తో ఆడనుంది. ప్రపంచకప్‌లో నేడు జపాన్ x పోలాండ్ రా.గం. 7.30 నుంచి సెనెగల్ x కొలంబియా రా.గం. 7.30 నుంచి పనామా x ట్యూనిషియా రా.గం. 11.30 నుంచి ఇంగ్లండ్ x బెల్జియం రా.గం. 11.30 నుంచి -
ఎంపీ బ్లూస్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: కిషన్ ప్రసాద్ హెచ్‌సీఏ వన్డే నాకౌట్ టోర్నమెంట్లో ఎంపీ బ్లూస్ 23 పరుగుల తేడాతో తిరుమల జట్టుపై విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎంపీ బ్లూస్ 160 పరుగులకు ఆలౌటైంది. స్వామి (59) అర్ధసెంచరీ చేశాడు, రెహమత్ 32 పరుగులు చేయగా, తిరుమల బౌలర్లు శివ, అశ్విన్ చెరో 4 వికెట్లు తీశారు. తర్వాత తిరుమల జట్టు 137 పరుగులు చేసి ఆలౌటైంది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు విజయనగర్: 179/8 (మునవర్ 56, సందీప్ 32; శివ 3/36), సెయింట్ మేరీస్: 175 (సందీప్ 54, రాహుల్ 31; సంజీవ్ 3/24, ఖాజా 3/29) మయూర: 230 (గుర్విందర్ సింగ్ 52, కరణ్ 38; అమిర్ 5/40), అమీర్‌పేట్: 175 (శివ 75; అఖిలేశ్ 4/41, కమల్ 3/39) ఏవీసీసీ: 222/6 (సాయిప్రజ్ఞయ్ 99, దీపక్ 50; శివ 3/24), టీమ్ కున్: 214 (శివ 53, సహస్ర 37; ఈశ్వర్ రావు 3/33) లక్కీ: 180/6 (సునీల్ 77 నాటౌట్; నరేందర్ 3/33), సెయింట్ సాయి: 152 (రాజు 51, ఆనంద్ 5/23). -
బిష్ణుదాస్ శతకం
జింఖానా, న్యూస్‌లైన్: సదరన్ స్టార్స్ బ్యాట్స్‌మన్ బిష్ణుదాస్ (106) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఆ జట్టు 68 పరుగుల తేడాతో విద్యుత్ సౌధ జట్టుపై విజయం సాధించింది. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బరిలోకి దిగిన సదరన్ స్టార్స్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. విజయ్ (90) అర్ధ సెంచరీతో రాణించాడు. విద్యుత్ సౌధ బౌలర్ జగన్నాథ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన విద్యుత్ సౌధ 150 పరుగులకే కుప్పకూలింది. వాసు (52) అర్ధ సెంచరీతో చెలరేగగా... మహ్మద్ అలీ 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సదరన్ స్టార్స్ బౌలర్ సాయి చరణ్ 4 వికెట్లు పడగొట్టాడు. మరో మ్యాచ్‌లో హెచ్‌యూసీసీ జట్టు 5 వికెట్ల తేడాతో స్పోర్టివ్ సీసీ జట్టుపై గెలుపొందింది. మొదట బరిలోకి దిగిన స్పోర్టివ్ సీసీ 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. తరుణ్ (45) మెరుగ్గా ఆడాడు. హెచ్‌యూసీసీ బౌలర్ రమేష్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన హెచ్‌యూసీసీ 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. ఖలీముద్దీన్ (31), సయ్యద్ అస్లామ్ (32 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.