బిష్ణుదాస్ శతకం | bishnudas hits century | Sakshi
Sakshi News home page

బిష్ణుదాస్ శతకం

Published Sat, Dec 21 2013 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

bishnudas hits century

జింఖానా, న్యూస్‌లైన్: సదరన్ స్టార్స్ బ్యాట్స్‌మన్ బిష్ణుదాస్ (106) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఆ జట్టు 68 పరుగుల తేడాతో విద్యుత్ సౌధ జట్టుపై విజయం సాధించింది. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బరిలోకి దిగిన సదరన్ స్టార్స్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. విజయ్ (90) అర్ధ సెంచరీతో రాణించాడు. విద్యుత్ సౌధ బౌలర్ జగన్నాథ్ 3 వికెట్లు తీసుకున్నాడు.
 
  అనంతరం బ్యాటింగ్ చేసిన విద్యుత్ సౌధ 150 పరుగులకే కుప్పకూలింది. వాసు (52) అర్ధ సెంచరీతో చెలరేగగా... మహ్మద్ అలీ 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సదరన్ స్టార్స్ బౌలర్ సాయి చరణ్ 4 వికెట్లు పడగొట్టాడు. మరో మ్యాచ్‌లో హెచ్‌యూసీసీ జట్టు 5 వికెట్ల తేడాతో స్పోర్టివ్ సీసీ జట్టుపై గెలుపొందింది.

 మొదట బరిలోకి దిగిన స్పోర్టివ్ సీసీ 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. తరుణ్ (45) మెరుగ్గా ఆడాడు. హెచ్‌యూసీసీ బౌలర్ రమేష్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన హెచ్‌యూసీసీ 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. ఖలీముద్దీన్ (31), సయ్యద్ అస్లామ్ (32 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement