ఇంగ్లండ్‌ గెలవాలి: సచిన్‌ | Sachin Tendulkar Supports to England For FIFA | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ గెలవాలి: సచిన్‌

Published Wed, Jul 11 2018 5:26 PM | Last Updated on Sat, Aug 25 2018 6:31 PM

Sachin Tendulkar Supports to England For FIFA - Sakshi

సచిన్‌ టెండూల్కర్‌( ఫైల్‌ ఫోటో)

హైదరాబాద్‌: ఫిఫా ప్రంపకప్‌ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే ఫ్రాన్‌ ఫైనల్‌ చేరుకోగా.. మరో ఫైనల్‌ బెర్త్‌ కోసం ఇంగ్లండ్‌- క్రోయేషియా తలపడనున్నాయి. ఎవరికి అందని అంచనాలతో అదరగొడుతున్న ఇంగ్లండ్‌ జట్టే కప్పు గెలవాలని క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఆకాంక్షించారు. ట్విటర్‌ వేదికగా బ్రిటీష్‌ జట్టుకు మద్దతు తెలుపుతూ సచిన్‌ ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. అంతేకాకుండా ఇంగ్లండ్‌ మాజీ ఫుట్‌బాలర్‌, కేరళ బ్లాస్టర్‌ మేనేజర్‌ డేవిడ్‌ జేమ్స్‌ను ట్యాగ్‌ చేశాడు.  ‘హాయ్‌ గాయ్స్‌, ఈ సారీ నేను పుట్‌బాల్‌లో ఇంగ్లండ్‌కు మద్దతు ఇస్తున్నాను.. కమాన్‌ ఇంగ్లండ్‌’ అంటూ సచిన్‌ వీడియోను చిత్రీకరించి పోస్ట్‌చేశారు. ఇప్పడా ఆ పోస్ట్‌ వైరల్‌ కావడంతో ఇంగ్లండ్‌కు అభిమానుల మద్దతు మరింత పెరిగింది.

ఇతర క్రీడలపై అభిమానం.. టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు క్రికెట్‌ మాత్రమే కాకుండా ఇతర క్రీడలపై అభిమానం ఎక్కువే. ఫుట్‌బాల్‌ను సచిన్‌ అమితంగా ఇష్టపడతాడు కాబట్టే ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌)లో కేరళ బ్లాస్టర్స్‌కు సహ యజమానిగా వ్యవహరిస్తూ ఫుట్‌బాల్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. టెన్సిస్‌ను కూడా ఇష్టపడే సచిన్‌ రోజర్‌ ఫెడరర్‌కు వీరాభిమాని. దేశంలో కబడ్డీని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రో కబడ్డీ లీగ్‌లో తమిళ్‌ తలైవాస్‌ను కొనుగోలు చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement