ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి ఫ్రాన్స్ దూసుకెళ్లింది. మంగళవారం అర్థరాత్రి బెల్జియంతో జరిగిన సెమీ ఫైనల్లో ఫ్రాన్స్ 1-0 తేడాతో విజయం సాధించింది. ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా, క్వార్టర్స్‌లో ఉరుగ్వేను మట్టికరిపించిన ఫ్రాన్స్.. సెమీస్‌లో అదే ఉత్సాహంతో బెల్జియంను ఓడించింది. టైటిల్‌ను అందుకోవాలన్న బెల్జియం ఆశలు ఆవిరయ్యాయి. ఇరు జట్లు హోరా హోరీగా పోరాడటంతో తొలి అర్ధభాగం వరకు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.