కొలంబియాకు మూడో స్థానం | Third place in Columbia | Sakshi
Sakshi News home page

కొలంబియాకు మూడో స్థానం

Published Mon, Jun 27 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 3:28 AM

కొలంబియాకు మూడో స్థానం

కొలంబియాకు మూడో స్థానం

అమెరికాపై 1-0తో విజయం
►  కోపా అమెరికా కప్

 
గ్లెండేల్ (అమెరికా): కోపా అమెరికా కప్‌లో కొలంబియా జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఆతిథ్య అమెరికా జట్టుతో ఆదివారం మూడు, నాలుగో స్థానం కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో కొలంబియా 1-0 గోల్‌తో నెగ్గింది. స్ట్రయికర్ కార్లోస్ బాకా (31వ నిమిషంలో) కొలంబియా తరఫున ఏకైక గోల్ సాధించాడు. అర్జెంటీనాతో జరిగిన సెమీఫైనల్లో 0-4తో ఓడిన అమెరికా ఈ మ్యాచ్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. గోల్ కీపర్ డేవిడ్ ఓస్పినా అడ్డుగోడలా నిలవడంతో పలు గోల్ ప్రయత్నాలు కూడా వమ్ము అయ్యాయి.

ఈ టోర్నీలో కొలంబియా చేతిలో అమెరికా ఓడటం ఇది రెండోసారి. మ్యాచ్ తొలి 12వ నిమిషంలోనే స్టార్ ఆటగాడు జేమ్స్ రోడ్రిగ్వెజ్ గోల్ అవకాశాన్ని కీపర్ టిమ్ హోవర్డ్ అడ్డుకున్నాడు. అయితే ఆ తర్వాత అతనే ఇచ్చిన పాస్‌ను 31వ నిమిషంలో బాకా అతి సమీపం నుంచి గోల్ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. ద్వితీయార్ధంలో డెంప్సీ ఫ్రీకిక్ దాదాపు గోల్‌పోస్టులోకి వెళ్లినట్టే అనిపించినా ఓస్పినా ఒంటి చేత్తో దాన్ని అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ నమోదు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement