నిజంగా ఆ 'కిక్' అద్భుతం!
శాంటింగో:కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీ- 2015లో భాగంగా అర్జెంటీనాతో జరిగిన ఫైనల్ పోరులో చిలీ ఘనవిజయం సాధించడంతో ఆ జట్టు కోచ్ జార్జ్ సాంపౌలీ ఆనందంలో మునిగితేలుతున్నాడు. పెనాల్టీ షూటౌట్ లో చిలీ విజయం కైవశం చేసుకోవడంతో తమ చిరకాల కోరిక నెరవేరిందన్నాడు. ఆ షూటౌట్ విజయం నిజంగా అద్భుతమైనది అభివర్ణించాడు. పెనాల్టీ షూటౌట్ లో అలెక్సిస్ శాంచెజ్ అద్భుతం చేసి తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే, నమ్మశక్యం కాని ఆనందాన్నిచ్చాడన్నాడు.
'ఆ పెనాల్టీ విజయం నాకు మరిచిపోలేని జ్ఞాపికను అందించింది. జట్టు సమిష్టిగా రాణించి అర్జెంటీనాను కంగుతినిపించింది. మా ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాం. బలమైన అర్జెంటీనాను మట్టికరిపించాలంటే బంతిని ఎక్కువ సమయం తమ అధీనంలోనే ఉంచుకోవాలనే మా వ్యూహం విజయవంతమైంది. ఈ ఆనంద క్షణాల్ని ఆటగాళ్లతో కలిసి పంచుకోవాలనుకుంటున్నా' అని సాంపౌలీ తెలిపాడు.
శాండియాగోలో ఆదివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) జరిగిన ఫైనల్స్లో ఆతిథ్య చిలీ.. దిగ్గజ అర్జెంటీనా జట్టును 4-1 తేడాతో మట్టికరిపించి ట్రోఫీ సొంతం చేసుకుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఇరుజట్లూ నిర్ణీత సమయానికి గోల్ సాధించకపోవడంతో ఎక్స్ట్రా టైమ్ ఆడాల్సి వచ్చింది. అదికూడా డ్రాగా ముగియడంతో పెనాల్టీ షూట్ అవుటే శరణ్యమైంది.
కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీ- 2015లో చిలీ విజేతగా నిలవడంతో వారి 99 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. శాండియాగోలో ఆదివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) జరిగిన ఫైనల్స్లో ఆతిథ్య చిలీ.. దిగ్గజ అర్జెంటీనా జట్టును 4-1 తేడాతో మట్టికరిపించి ట్రోఫీ సొంతం చేసుకుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఇరుజట్లూ నిర్ణీత సమయానికి గోల్ సాధించకపోవడంతో ఎక్స్ట్రా టైమ్ ఆడాల్సి వచ్చింది. అదికూడా డ్రాగా ముగియడంతో షూట్ అవుటే శరణ్యమైంది.
చిలీ గోల్ కీపర్ క్లౌడియో బ్రావో సమయ స్పూర్తితో ఒక గోల్ తప్పించడం, అర్జెంటీనా ఆటగాళ్లుకూడా బంతిని గోల్ పోస్టులోకి పంపడంలో రెండు దఫాలు విఫలం కావడంతో 4-1 తేడాతో చిలీ విజయం సాధించింది.