
‘కోపా’ సెమీస్‌లో చిలీ
క్వార్టర్స్‌లో ఉరుగ్వేపై 1-0తో గెలుపు
సాంటియాగో: మ్యాచ్ చివరి దశలో అమోఘమైన ఆటతీరుతో చెలరేగిన చిలీ... కోపా అమెరికా కప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 1-0తో డిఫెండింగ్ చాంపియన్ ఉరుగ్వేపై విజయం సాధించింది. దీంతో తొలిసారి కోపా కప్‌ను గెలవాలన్న కలకు చిలీ మరో రెండు అడుగుల దూరంలో నిలిచింది. డిఫెండర్ మురిసియో ఇస్లా (81వ ని.) చిలీ తరఫున ఏకైక గోల్ సాధించాడు. ఆద్యంతం హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు ఆగ్రహావేశాలకు లోనయ్యారు.