బ్రెసిలియా: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ అరుదైన రికార్డును నెలకొల్పాడు. పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉన్న ఫ్రీకిక్ గోల్స్ రికార్డును ఈ అర్జెంటీనా సంచలన ఫుట్‌బాలర్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా మొత్తం మూడు గోల్స్ చేయగా.. అన్నింటిలోనూ మెస్సీ భాగస్వామిగా ఉన్నాడు. తొలి రెండు గోల్స్‌లో బాల్‌ను పాస్ చేయడంలో కీలకపాత్ర పోషించిన మెస్సీ.. ఓ ఫ్రీకిక్‌ను గోల్‌గా మలచి అర్జెంటీనా లీడ్‌ను 3-0కు పెంచాడు.
ఈ క్రమంలోనే రొనాల్డో రికార్డును మెస్సీ అధిగమించాడు. ఇప్పటివరకు రొనాల్డో ఫ్రీకిక్స్‌తో 57 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా, తాజాగా జరిగిన మ్యాచ్‌లో మెస్సీ 58వ సారి ఫ్రీకిక్ గోల్ సాధించి టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ప్రస్తుతానికి 76 గోల్స్ సాధించిన మెస్సీ.. మరొక్క గోల్ చేస్తే, అత్యధిక గోల్స్ సాధించిన సౌత్ అమెరికన్‌గా చరిత్ర పుటల్లో నిలుస్తాడు. ఈ జాబితాలో దిగ్గజ ఫుట్‌బాలర్, బ్రెజిల్ మాజీ కెప్టెన్ పీలే 77 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment