
సాంటాక్లారా (అమెరికా): కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ విజేత బ్రెజిల్ జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. కొలంబియా జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌ను బ్రెజిల్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. బ్రెజిల్ తరఫున రాఫినా (12వ ని.లో), కొలంబియా తరఫున డేనియల్ మునోజ్ (45+2వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.
ఏడు పాయింట్లతో కొలంబియా గ్రూప్ ‘టాపర్’గా నిలువగా... ఐదు పాయింట్లతో బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో ఈక్వెడార్‌తో అర్జెంటీనా; వెనిజులాతో కెనడా; పనామాతో కొలంబియా; ఉరుగ్వేతో బ్రెజిల్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment