34 టైటిల్స్‌ గెలిచిన మెస్సీకి ఆ లోటు తీరేనా?! | Copa America Cup Final: Argentina Vs Brazil Will Messi Create Record | Sakshi
Sakshi News home page

34 టైటిల్స్‌ గెలిచిన మెస్సీకి ఆ లోటు తీరేనా?!

Published Sat, Jul 10 2021 10:35 AM | Last Updated on Sat, Jul 10 2021 10:39 AM

Copa America Cup Final: Argentina Vs Brazil Will Messi Create Record - Sakshi

రియో డి జనీరో: తన ప్రొఫెషనల్‌ క్లబ్‌ కెరీర్‌లో 34 టైటిల్స్‌ నెగ్గిన అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లయెనల్‌ మెస్సీ దేశం తరఫున మాత్రం ఇప్పటి వరకు ఒక్క గొప్ప టైటిల్‌ను కూడా గెలవలేకపోయాడు. కోపా అమెరికా కప్‌ రూపంలో ఆ లోటును తీర్చుకునే అవకాశం మళ్లీ మెస్సీకి లభించింది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బ్రెజిల్‌తో అర్జెంటీనా తలపడనుంది.

చివరిసారి అర్జెంటీనా 1993లో కోపా అమెరికా కప్‌ చాంపియన్‌గా నిలిచింది. 2004, 2007, 2015, 2016ల్లో రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఈసారి ఎలాగైనా టైటిల్‌ను నెగ్గాలనే కసితో మెస్సీ బృందం కనిపిస్తోంది. ఫైనల్‌ ఆదివారం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి సోనీసిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement