
గట్టెక్కిన అర్జెంటీనా
ఉరుగ్వేపై 1-0తో గెలుపు
కోపా అమెరికా కప్
లా సెరినా (చిలీ): గెలవాల్సిన తొలి మ్యాచ్‌ను ‘డ్రా’తో సరిపెట్టుకున్న అర్జెంటీనా... రెండో మ్యాచ్ లో మాత్రం ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఆడింది. డిఫెండింగ్ చాంపియన్ ఉరుగ్వేతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో విజ యం సాధించింది. ఆట 56వ నిమిషంలో పాబ్లో జబలెటా కొట్టిన క్రాస్ షాట్‌ను ‘డి’ బాక్స్‌లో అందుకున్న సెర్గియో అగుయెరో హెడర్ షాట్‌తో బంతిని లక్ష్యానికి చేర్చాడు. ఈ విజయంతో అర్జెంటీనా గ్రూప్ ‘బి’లో నాలుగు పాయింట్లతో పరాగ్వేతో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉంది. చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ ల్లో పరాగ్వేతో ఉరుగ్వే, జమైకాతో అర్జెంటీనా తలపడతాయి. పరాగ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌లో చివరి నిమిషంలో గోల్ సమర్పించుకొని ‘డ్రా’తో సంతృప్తిపడిన అర్జెంటీనా... ఉరుగ్వేతో మాత్రం ఏ దశలోనూ దూకుడు తగ్గించకుండా ఆడింది. ఈ రెండు జట్ల మధ్య ఇది 199వ మ్యాచ్ కావడం విశేషం.
కోపా అమెరికా కప్‌లో నేడు
పెరూ ఁ వెనిజులా
ఉదయం గం. 5.00 (శుక్రవారం) నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం